శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 జూన్ 2021 (12:19 IST)

ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ అడవుల్లో ఎన్‌కౌంటర్ - ఇద్దరి హతం

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల వేట కొనసాగుతోంది. ఇటీవలికాలంలో మావోల కార్యకలాపాలు అధికం కావడంతో పోలీసులకు కూంబింగ్ మొదలు పెట్టారు. ఈ క్రమంలో తాజాగా ఈ రాష్ట్రంలోని నారాయణపూర్‌ జిల్లా అటవీ పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. 
 
ఓర్చా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌ కూంబింగ్‌ నిర్వహిస్తుండగా నక్సల్స్‌ తారసపడటంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో ఇద్దరు నక్సల్స్‌ ఘటనాస్థలంలోనే చనిపోయినట్లు నారాయణపూర్‌ ఎస్పీ మోహిత్ గార్గ్‌ తెలిపారు. 
 
మృతిచెందిన నక్సల్స్‌ వివరాలను గుర్తించాల్సి ఉందన్నారు. శుక్రవారం బస్తర్‌ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మహిళా నక్సలైట్‌ మృతిచెందగా, ఘటనాస్థలంలో 3 ఏకే 47 రైఫిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు ఆయన వివరించారు.