శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 మే 2020 (15:33 IST)

సైబర్ కేటుగాళ్లున్నారు జాగ్రత్త- పేటీఎం పాపం.. రూ.10 రీచార్జ్ అంటూ లక్ష టోకరా

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ కూర్చుంటున్న సైబర్ నేరగాళ్లు.. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమవుతూ డిజిటల్ చెల్లింపులు చేస్తున్న వారిపై విరుచుకుపడుతున్నారు. తాజాగా, ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రూ.10 రీచార్జ్ అంటూ.. లక్షలు కొల్లగొట్టిన కేటుగాల్ల బాగోతం బయటపడింది.. రూ.10 రీచార్జ్‌ పేరుతో ప్రభుత్వ టీచర్ పేటీఎం అకౌంట్‌ను తమ గుప్పిట్లోకి తీసుకున్నారు.
 
పేటీఎం అకౌంట్‌ నుంచి రూ.10 మొబైల్ రీచార్జ్ చేయడంతో.. క్షణాల్లో లక్ష రూపాయలు కాజేశారు. మొబైల్‌కు రావాల్సిన ఓటీపీని సైతం రాకుండా చేసేయడంతో.. ఆ టీచర్‌కు వెంటనే విషయం అర్థం కాలేదు.. ఆలస్యంగా విషయం గ్రహించిన ఎల్బీ నగర్‌ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
అయితే, ఫిర్యాదు చేసిన మరుసటి రోజూ మరో బ్యాంకు ఖాతా నుండి మరో లక్ష రూపాయాలకు కొట్టేశారు కేటుగాళ్లు. లాక్‌డౌన్ సమయంలో విద్యుత్, నీటి బిల్లుల చెల్లింపు కోసం పేటీఎం యాప్‌ను మొబైల్‌లో వేసుకున్నామని.. కానీ, ఇంటి లోన్ కోసం దాచుకున్న సొమ్మును కాజేశారంటూ లబోదిబోమంటున్నారు.