అబ్బా... ఇన్‌స్టాతో విసిగిపోయా: బిగ్‌బాస్ సీజన్ కంటిస్టెంట్ పునర్నవి
బిగ్‌బాస్ సీజన్-3 కంటిస్టెంట్ పునర్నవి భూపాలం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉయ్యాలా జంపాలా, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి చిత్రాల్లో కనిపించిన పునర్నవి తన అందం, అభినయంతో అభిమానులను సంపాదించుకున్న విషయం తెలిసిందే. బిగ్‌బాస్-3 పునర్నవి క్రేజ్‌ను మరింతగా పెంచింది. ఆమె బిగ్ బాస్ ద్వారా అభిమానులకు క్లోజ్ అయ్యింది.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే పునర్నవి.. ఇక ఇన్‌స్టాకు దూరంగా వుంటానని ప్రకటించింది. కొంతకాలం పాటు యాడ్ స్టోరీ పోస్టులను షేర్ చేయనని తెలిపింది. ఇన్‌స్టా అనేది విషపూరితమైన సాధనమని.. తాను పూర్తిగా ఇన్‌స్టా విసిగిపోయానని తెలిపింది. మళ్లీ కొత్తగా జీవం పోసుకోవడానికి కొంత సమయం పడుతుందని వెల్లడించింది.
ఇటీవల ఢిల్లీలో కొందరు సంపన్న విద్యార్థులు 'బాయ్స్ లాకర్ రూమ్' పేరుతో ఇన్‌స్టాగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసి వికృత చర్యలకు పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనపై పునర్నవి స్పందించింది. సోషల్ మీడియాలో పిల్లలు ఎలా వుండాలో చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని చెప్పింది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు పలు కామెంట్లు చేశారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్‌ను పెంచుకోవటం కోసమే ఇటువంటి పోస్టులు పెడుతున్నారని అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఆ నెటిజన్ పెట్టిన కామెంట్‌ను స్క్రీన్ షాట్ తీసిన పునర్నవి మళ్లీ యాడ్ స్టోరీగా ఇన్‌స్టాలో షేర్ చేశారు.
ఇక దీనిపై సదరు నెటిజన్ స్నేహితుడు స్పందిస్తూ.. ''మీరు పెట్టిన పోస్ట్ వల్ల తల్లిదండ్రుల వద్ద అతని పరువు పోతుంది'' అంటూ కామెంట్ చేశారు. దీనిపై స్పందించిన పునర్నవి.. ''తాను సోషల్ మీడియాలోకి వచ్చింది ఎవరిని దూషించడానికి, నిందించడానికి కాదు" అని స్పష్టం చేసింది. అంతేగాకుండా.. తాను పూర్తిగా ఇన్‌స్టాతో విసిగిపోయానని చెప్పుకొచ్చింది.