కరోనా జగమొండిదా? 30 రూపాల్లో వ్యాపిస్తోందా? (Video)

coronavirus
ఠాగూర్| Last Updated: గురువారం, 23 ఏప్రియల్ 2020 (20:53 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇపుడు జగమొండిగా మారినట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఈ వైరస్ ఏకంగా 30 రూపాలు సంతరించుకుందనే ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

చైనాలోని వూహాన్ కేంద్రంగా పుట్టుకొచ్చిన ఈ వైరస్... ఇపుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం తెల్సిందే. అయితే, ఈ వైరస్ ఇపుడు జన్యుపరంగా వివిధ మార్పులకు గురై, ఏకంగా 30 రూపాలు సంతరించుకున్నట్టు తాజా అధ్యయనంలో తేలింద‌ని వారు చెబుతున్నారు.

సార్స్‌-కొవ్-2 వైరస్‌ ఇప్పటికే 30 కంటే ఎక్కువ జాతులుగా పరివర్తనం చెందిందని, ప్రపంచంలోని వివిధ దేశాల్లో వేర్వేరు రూపాల్లో పంజా విసురుతోందని వారు ఆ అధ్య‌య‌నంలో తేల్చారు. ఇలా జన్యురూపాంతరం చెందితే మరింత ప్రమాదకారిగా మారుతుందని వారు హెచ్చరిస్తున్నారు.

పైగా, ఇలాంటి వైరస్‌ను నివారించే క్రమంలో మరిన్ని సమస్యలు తలెత్తే అవ‌కాశం ఉంద‌ని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. హాంగ్జవులోని జెజియాంగ్‌ యూనివర్సిటీ ప్రొఫెస‌ర్ లీ లాంజువాన్‌ తన సహచరులతో కలిసి ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. మొత్తం 1,264 మంది బాధితుల్లో 11 మంది నుంచి సేకరించిన నమూనాలను పరిశీలించిన‌ట్లు వారు తెలిపారు.

దీనిపై మరింత చదవండి :