1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 17 డిశెంబరు 2020 (06:59 IST)

రైతుల ఆందోళనలకు మద్దతుగా కాగడాల ప్రదర్శన

ఏపీ రాజధాని కోసం పోరాటం ఉధృతమవుతోంది. గొల్లపూడి గ్రామంలో తెదేపా కాగడాల ప్రదర్శన చేపట్టారు. గొల్లపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నేతలు కాగడాల ప్రదర్శన నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్థానిక తెదేపా నేతలు పాల్గొన్నారు. ఈ మేరకు దేవినేని ఉమా మాట్లాడుతూ, అమరావతే ఏకైక రాజధానిగా ఉంచేంత వరకు ఉద్యమం ఆగదని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. సీఎం జగన్ కాళ్ల బేరానికి ఢిల్లీ వెళ్లారని దేవినేని ఉమ విమర్శించారు.

పాదయాత్ర సమయంలో మాటతప్పం.. మడం తిప్పమని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే మూడు రాజధానులని ప్రకటన చేసి మాటతప్పారని విమర్శించారు.

న్యాయం ధర్మం తప్పకుండా గెలుస్తుందని, జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా అమరావతి రైతులు, మహిళలు, రైతు కూలీలందరి కష్టాలు కన్నీళ్లు వృథా కావని ఈ ప్రభుత్వానికి ఆ ఉసురు తగులుతుందని దీనికి తగిన మూల్యం జగన్ ప్రభుత్వం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. 

గురువారం ఉదయం 10 గంటలనుండి  సాయంత్రం 5 గంటల వరకు రాజధాని ప్రాంతములోని రాయపూడి గ్రామములోని పెట్రోల్ బంకు వద్ద ఉన్న ప్రదేశం నందు " రాజధాని అమరావతి రక్షణకై - జనభేరి "  భారీ బహిరంగ సభకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, అన్ని రాజకీయ పక్షాల అధినేతలు మరియు రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి  రైతు నాయకులు, అన్ని రాజకీయేతర సంఘాల ప్రతినిధులు హాజరు అవుతున్నారని, అందరూ పాల్గొని ఈ జనభేరి ని దిగ్విజయం చేయవలసినదిగా విజ్ఞప్తి చేసారు.