కాన్వాయ్ దిగిన జనసేనాని.. దివ్యాంగుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు...(video)
ఏపీలో పలు ప్రాంతాల్లో పర్యటించిన జనసేనాని పవన్.. ఆ సమయంలో ప్రజల కష్టాలు, కన్నీళ్లు దగ్గర్నుంచి చూశానని అందుకే వారికి దగ్గరై సమస్యలు తీర్చే శాఖలు తీసుకున్నట్లు స్వయంగా తెలిపారు.
ఇందుకోసం జనవాణి నిర్వహించి బాధితుల సమస్యలు తెలుసుకోవడంతో పాటు వాటికి పరిష్కారం ఏంటని సైతం వారిని అడిగి తెలుసుకుని, సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యపై మాట్లాడుతున్నారు. యువత, వృద్ధులు, దివ్యాంగులు అనే వ్యత్యాసం లేకుండా అందరికీ పవన్ కళ్యాణ్ తమ సమస్యలను తీర్చుతానని హామీ ఇచ్చారు.
ఈ క్రమంలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాన్వాయ్‌లో వెళ్తుండగా.. వున్నట్టుండి ఆపారు. కాన్వాయ్ ఆగిన వెంటనే రోడ్డుకు సమీపంలోని దివ్యాంగులను పలకరించారు. వారి వద్ద వినతి పత్రాలను అందుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.