బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 అక్టోబరు 2024 (09:40 IST)

#TheyCallHimOG - షూటింగ్‌లతో పవన్ బిజీ బిజీ

OG
OG
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఓజీ సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా వున్నాడు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కల్యాణ్.. అంతకుముందే సంతకం చేసిన సినిమాలను పూర్తి చేయాలనే దిశగా షూటింగ్‌ల్లో పాల్గొంటున్నారు. దీంతో పవన్ కళ్యాణ్‌కు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు నిర్మాతలు సెట్స్ వేశారు. 
 
అవుట్ డోర్ షూటింగ్‌లను క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు హరి హర వీరమల్లు షూటింగ్‌లో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారని తెలుస్తోంది. తాజాగా నిధి అగర్వాల్ వేసిన ట్వీట్‌తో పవన్ ఓజీ సినిమాకు చెందిన సన్నివేశాల చిత్రీకరణలో వున్నట్లు అర్థమవుతోంది.
 
మరోవైపు ఓజీ యూనిట్ కూడా కొత్త షెడ్యూల్‌ను రెడీ చేసుకుంది. ఆల్రెడీ రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ వేశారట. ఇతర ఆర్టిస్టులతో రాత్రి పూట షూటింగ్ చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ రెండు, మూడు రోజుల్లో వస్తాడట. ఈ షెడ్యూల్‌తో ఓజీ షూట్ పూర్తి కానున్నట్టుగా తెలుస్తోంది.