శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 అక్టోబరు 2024 (10:24 IST)

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టీమ్‌లోకి ఆమ్రపాలి

Amrapali IAS
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టీమ్‌లోకి ఆమ్రపాలి జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. డీఓపీటీ ఆదేశాల మేరకు తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన నలుగురు ఐఏఎస్‌లలో ఆమ్రపాలి కూడా వుండటం గమనార్హం. 
 
అయితే తెలంగాణ నుంచి బుధవారమే ఆమె ఏపీకి చేరారు. గురువారం రాష్ట్ర సీఎస్ నీరబ్ కుమార్‌కు రిపోర్ట్ చేశారు. దీంతో ఆమెకు కేటాయించే పదవిపై చర్చ మొదలైంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టీమ్‌లోకి ఐఏఎస్ అధికారి ఆమ్రపాలిని నియమించనున్నట్లుగా ప్రచారం సాగుతోంది. 
 
మరోవైపు ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఐపీఎస్‌లను తెలంగాణకు రిలీవ్ చేస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. సి.హరికిరణ్‌(2010), జి.సృజన(2013), శివశంకర్‌ లోతేటి(2013)లను డీవోపీటీ ఆదేశాల మేరకు రిలీవ్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
 
తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సిన.. వాణిప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రాస్, ఆమ్రపాలి తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యారు.