సోమవారం, 4 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 14 అక్టోబరు 2024 (22:36 IST)

449 మంది విద్యార్థుల త్రాగునీటి సమస్య తీర్చిన డిప్యూటీ సీఎం పవన్

pawan kalyan
గత నాలుగేళ్లుగా రక్షిత త్రాగునీటి సదుపాయం లేక అవస్థలు పడుతున్న 449 మంది విద్యార్థులకు మంచినీటి సౌకర్యం కల్పించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు బాలుర ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థుల తాగునీటి సమస్యను తెలుసుకుని, సమీపంలోని శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్ వద్ద మంచినీరు వస్తున్న విషయం గుర్తించారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో సంబంధిత అధికారులు రైస్ మిల్ యాజమాన్యంతో మాట్లాడి వారిని ఒప్పించారు.
 
4 లక్షల CSR ( Corporate Social Responsibility) నిధులతో RO ప్లాంట్‌కు రైస్ మిల్ నుండి మంచినీటి సరఫరా ఏర్పాటు చేయడం కోసం డెడికేటెడ్ పైప్ లైన్ ఏర్పాటు చేయడం ద్వారా, విద్యార్థులకు స్వచ్ఛమైన రక్షిత త్రాగునీరు అందించేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకున్నది. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర రైస్ మిల్ యాజమాన్యానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. పాఠశాలలో మంచినీటి కుళాయిల నుంచి మంచినీటిని తమ బాటిళ్లలో నింపుకుంటూ విద్యార్థులు ఎంతో సంతోషపడుతున్నారు.