శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 జనవరి 2025 (17:09 IST)

పిఠాపురానికి పవన్ కళ్యాణ్ చేసిన పనులేంటి?

pawan kalyan
ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే, ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించడంతో పాటు.. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకు మంత్రిగా ఉన్నారు. 
 
అయితే, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన గత ఆరు నెలల్లో చేపట్టిన పనులపై సమగ్ర అభివృద్ధి నివేదిక 2024 పేరిట విడుదల చేశారు. ఈ మేరకు పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి కోసం ఆరున్నర నెలల్లో తాను ఏం చేశాననే వివరాలను ఏపీ డిప్యూటీ సీఎం పేషీ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది. 
 
ఇందులోభాగంగా రూ.2 కోట్ల అంచనా వ్యయంతో పేదల పెళ్లిళ్ల కోసం తితిదే కళ్యాణ మండపం, రూ.72 లక్షల వ్యయంతో గొల్లప్రోలులో తాగునీటి సౌకర్యం, 32 పాఠశాలల్లో క్రీడా కిట్ల పంపిణీ, సీహెచ్‌సీని 100 పడకల ఆస్పత్రిగా స్థాయిపెంపు, పాఠశాలలు, కాలేజీల్లో ఆర్ఓ ప్లాంట్లు సహా మరికొన్ని అభివృద్ధి పనులు  చేసినట్టు పేర్కొంది. అలాగే, డిప్యూటీ సీఎంగా తాను ఏం చేశాననే వివరాలను కూడా పవన్ కళ్యాణ్ షేర్ చేశారు.