డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్.. స్టెల్లా షిప్‌ను సీజ్ చేసిన అధికారులు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తనిఖీల్లో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి బియ్యం తరలిస్తున్న స్టెల్లా షిప్‌ను సీజ్ చేయాలని ఆదేశించారు. తాజాగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఓడను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.
బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన కలెక్టర్, ఎగుమతిదారుని గుర్తించి బియ్యాన్ని గోడౌన్‌కు తిరిగి తెస్తామని చెప్పారు. పేదలకు అందాల్సిన బియ్యం గోడౌన్ నుంచి కాకినాడ ఓడరేవులోని ఓడకు ఎలా రవాణా చేయబడిందో పరిశీలిస్తాం. పేదల కోటాకు చెందిందో లేదో పరిశీలిస్తాం.. అని షాన్ మోహన్ వివరించారు.
సమగ్ర విచారణ జరిపేందుకు రెవెన్యూ, పోలీస్, కస్టమ్స్, పౌరసరఫరాల శాఖ, పోర్టు అథారిటీ అధికారులతో కూడిన ఐదుగురు సభ్యులతో కూడిన క్రమశిక్షణా బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారు.