గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 డిశెంబరు 2024 (16:27 IST)

మంటల్లో కాలిపోయిన బస్సు.. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న భక్తులు!! (Video)

fire accident
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం నుంచి శబరిమలై నుంచి కొందరు భక్తులతో వెళుతున్న బస్సు ఒకటి మంటల్లో కాలిపోయింది. ఈ బస్సు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు ఒక్కసారిగా నలు వైపులా వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. అయితే, ఈ బస్సుల నుంచి అయ్యప్ప భక్తులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. శబరిమల దర్శనం అనంతరం తిరిగి వస్తూ కంచి సమీపంలో భోజనం కోసం ఆపిన బస్సు, పక్కనే వంట చేస్తుండగా అకస్మాత్తుగా చెలరేగిన మంటలు చెలరేగాయి.