సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 3 డిశెంబరు 2024 (14:22 IST)

అటు ప్రభుత్వాలు ఇటు సినీ హీరోలు నిలువు దోపిడీ !

Fans, Prajalu dopidi
Fans, Prajalu dopidi
కొత్త సినిమా వచ్చిందంటే చాలు. అగ్రహీరోలు సినిమాల ఫ్యాన్స్ రెచ్చిపోతుంటారు. థియేటర్లలో కటౌట్లను కట్టి పూలమాలలు, పాలాభిషేకాలు వేసి హీరోలకు జేజేలు పలుకుతారు. అలాంటి ఫ్యాన్స్ ను టార్గెట్ చేసుకుని థియేటర్ల ఓనర్లు, బయ్యర్లు, నిర్మాతలు మూకుమ్మడిగా కలిసి టికెట్ల రేట్లను పెంచి నిలువుదోపిడీ చేస్తున్నారు. దీనికి అంతేలేకుండా పోయింది. ఇది వారసత్వంగా హీరోలకు దక్కిన ఓ నమ్మకమైన ద్రోహం కింద చెప్పవచ్చు. 
 
ఇంతకుముందు కొన్ని సినిమాలకు వారంరోజులు అసలు టికెట్ రేటుకంటే పదింతలు పెంచిన సందర్భాలున్నాయి. ఇప్పుడు పుష్ప 2 విషయంలో తెలంగాణాలో  1200 రూపాయలు, ఆంద్రలో 800 రూపాయలు పెంచేశారు. ఈ దోపిడీ ఇక్కడేకాదు. విదేశాలకు పాకింది. అక్కడ డాలర్లలో వెచ్చింది సాఫ్ట్వేర్ ఉద్యోగులు వీకెండ్ లో చూసేస్తుంటారు. అందుకు ఓవర్ సీస్ పంపిణీదారులు ఇందుకు మూలకారకులు. దీనిపై గతంలో చర్చకూడా జరిగింది. కానీ అందులో మార్పురాలేదు.
 
ఇక ఇండియాలో పరిస్థితి మరీ దారుణం. ఫ్యాన్స్ అంటే ప్రాణం అనే హీరోలు. ఆ ఫ్యాన్స్ ను నిలువుదోపిడీ చేయడం విడ్డూరంగా వుందని సినీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఫ్యాన్స్ అంటే ఎక్కువగా యూత్ వుంటారు. ఒకప్పుడు కాలేజీ ఫీజులు కింద తీసుకుని సినిమాలకు వెళ్ళిన తరం వుంది. ఇప్పుడు ఆ తరం వారసులు మళ్ళీ యూత్ హీరోలకు ఫ్యాన్స్ అయ్యారు. ఒక వారంరోజుల్లో వచ్చిన కాడికి దండుకునే బాపతు సినిమాలు నేడు వచ్చేశాయి.
 
ఈ దోపిడీ ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయి. ప్రతీ పండుగకు బస్ లలోనూ, రైల్వేలలోనూ టికెట్ల రేటు మూడింతలు, ఐదింతలు కూడా పెంచేసి ఇదేదో పెద్ద ఘనకార్యం చేసినట్లు ప్రకటిస్తుంటారు. అప్పుల్లో వున్న ఆర్.టి.సి., రైల్వేలకు ప్రజల జేబుల్లో డబ్బులు బలవంతంగా గుంజేసి ప్రజాసేవ పేరుతో చేస్తున్న చట్టబద్ధమైన దోపిడీ. ఈ విషయమై ఓ ప్రముఖ నిర్మాత మాట్లాడుతూ, ప్రభుత్వాలే ఇలా దోపిడీ చేస్తుంటే టికెట్ల్ రేట్లతో హీరోల అభిమానులనుంచి రాబట్టుకోవడంతప్పులేదని తెలియజేస్తున్నారు. అందుకే ఇప్పటికైనా ప్రజలు, ఫ్యాన్స్ కూడా కళ్లు తెరిచి వాస్తవంలోకి రావాలని కొందరు కోరుతున్నారు.