మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 2 డిశెంబరు 2024 (16:29 IST)

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

Pushpa 2
Pushpa 2
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన ఈ సినిమా డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. దీంతో వరల్డ్ వైడ్ ఈ పాన్ ఇండియా సినిమానే హాట్ టాపిక్ అయింది. ఎక్కడ చూసినా పుష్ప 2 మేనియా కనిపిస్తోంది.
 
మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ రూపొందిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా.. అనసూయ కీలక పాత్ర పోషిస్తోంది. ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
 
సినిమా రిలీజ్‌కు మరి కొన్ని రోజుల సమయమే ఉండడంతో, ఈ సినిమా కోసం మేకర్స్ అన్ని మార్గాల్లో ప్రమోషన్ చేపట్టారు. ఈ క్రమంలో, ముంబై మెట్రో రైళ్ల పైనా పుష్ప-2 చిత్రాన్ని బ్రాండింగ్ చేస్తున్నారు. ముంబై మెట్రో రైళ్లలో ప్రతి కంపార్ట్ మెంట్ పైనా పుష్ప-2 చిత్రం పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోను మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో పంచుకుంది.