బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 1 డిశెంబరు 2024 (22:30 IST)

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

Peelings
Peelings
పుష్ప-2 నుండి చాలా హైప్ చేయబడిన మాస్ డ్యాన్స్ నంబర్, "పీలింగ్స్" ముగిసింది. ఈ పాటకు డీఎస్పీ సంగీతం సమకూర్చారు. అల్లు అర్జున్ డ్యాన్స్ లేదా ప్రెజెన్స్ విషయానికి వస్తే, డ్యాన్స్ ఇరగదీశాడని టాక్. బన్నీ ఎనర్జీకి తగ్గట్టుగా రష్మిక అద్భుతంగా నటించింది. అయితే ఈ వీడియోలో హీరోయిన్‌కు తగినట్లు బన్నీ హైట్ తగ్గించారు. అంటే బన్నీ పొట్టిగా కనిపిస్తున్నాడు. 
Rashmika Mandanna
Rashmika Mandanna
 
ఫ్రీవీలింగ్ డ్యాన్స్‌ను సెంటర్ స్టేజ్‌లోకి తీసుకురావడానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. "పీలింగ్స్" థియేటర్లలో మాస్‌ని అలరించడానికి రెడీగా వుంది. పుష్పరాజ్ కాస్ట్యూమ్స్, వైబ్, మాస్ లిరిక్స్ అదిరిపోయింది. పుష్ప 2: ది రూల్ డిసెంబర్ 4న పెయిడ్ ప్రీమియర్లకు, డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.