విజయ్ ఇంట్లో రష్మిక దీపావళి వేడుకలు... డేటింగ్‌లో 'గీతగోవిందం' జంట
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నాల మధ్య రిలేషన్ ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి కారణం వారిద్దరు ఇటీవల చేసిన వ్యాఖ్యలే కారణంగా తెలుస్తుంది. తాజాగా రష్మిక మందన్నా.. విజయ్‌తో ఉన్న సంబంధాన్ని మెల్లగా బహిర్గతం చేస్తున్నారు. తాను దీపావళి వేడుకలను విజయ్ ఇంట్లోనే జరుపుకున్నట్టు వెల్లడించారు. అలాగే, విజయ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను డేటింగ్‌లో ఉన్నట్టు పేర్కొన్నారు. ప్రేమ గురించి విజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
తన పర్సనల్ లైఫ్ గురించి చాలా రోజులుగా ఉన్న అనుమానాలకు తెరదించే ప్రయత్నం విజయ్ చేశారు సాహిబా సాంగ్ ప్రమోషన్స్‌లో విజయ్ తాను రిలేషన్‌లో ఉన్నననీ.. తన సహనటుల్లో ఒకరితో డేటింగ్ చేసినట్లు అంగీకరించాడు. నాకు 35 సంవత్సరాలు. నేను ఒంటరిగా ఉంటానని మీరు అనుకుంటున్నారా అంటూ ఎదురు ప్రశ్న వేశాడు. రొమాంటిక్ రిలేషన్‌షిప్‌కు వెళ్లే ముందు.. తాను ఆ వ్యక్తులతో క్లోజ్ ఫ్రెండ్ షిప్ చేస్తానని.. తాను డేట్‌లకు వెళ్లననీ, ఎవరితోనైనా చాలా కాలం ఫ్రెండ్‌షిప్ ఉంటుందో వారితోనే మాత్రమే తాను బయటకు వెళ్తానన్నాడు.
తనకు షరతులు లేని ప్రేమ కావాలన్నాడు. తనకు ప్రేమించడం తెలుసు.. ప్రేమను తీసుకోవడం కూడా తెలుసని, ప్రేమ అనేది తప్పక పుడుతుంది అబ్బాయిలు. మీరు ఇంకా యంగ్‌గానే ఉన్నారు కాబట్టి కాస్త టైమ్ ఇవ్వండి. అన్నిటికంటే ముందుగా పురుషులు ఎదగాలి. ఇదేం చెడ్డ విషయం కాదు. మీరు కొంచెం సమయం ఇవ్వాలి దానికి.
లవ్ విషయంలో 30 దాటిన పురుషులు 20 ఏండ్ల మధ్య ఉన్నవారికంటే బెటర్‌గా ఆలోచిస్తారు. ఇది నా పర్సనల్ అనుభవం. 20 నుండి 30 ఏళ్ల మధ్య ఉన్నప్పుడు మనం అస్థిరంగా ఉంటాం. ఏది డిసైడ్ చేసుకోలేం. సమయం వచ్చినప్పుడు అవే జరుగుతాయి. ఏది ఫోర్స్‌గా చేయకండి అంటూ సలహాలు కూడా ఇచ్చాడు.