సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 నవంబరు 2024 (11:30 IST)

పుష్ప-2- 275 కోట్ల రూపాయలకు టీవీ రైట్స్.. నెట్‌ఫ్లిక్స్ అదుర్స్

Pushpa Raj & Srivalli
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇక మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలో సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు. 
 
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో రానున్న పుష్ప-2 కోసం బన్నీ లవర్స్‌తో పాటు సినీ ఆడియన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 
ఇక ఇటీవల ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ సైతం రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్ములేపుతుంది. యూట్యూబ్‌లో నంబర్ వన్ ట్రెండింగ్‌లో ఉంది.
 
పుష్ప-2లో అనసూయ, సునీల్‌తో పాటు కొత్తగా జగపతి బాబు, ప్రకాశ్ రాజ్ కూడా యాడ్ అయ్యారు. అలానే శ్రీలీల ఐటెం సాంగ్ చేసింది. పుష్ప అంటే ప్లవర్ అనుకుంటివా.. కాదు వైల్డ్ ఫైర్ అంటూ ట్రైలర్‌లో అల్లు అర్జున్ చేసిన సందడి యూట్యూబ్‌లో సరికొత్త రికార్డుల్ని నెలకొల్పోతోంది.
 
అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం, దాని భారీ బడ్జెట్, రికార్డ్-బ్రేకింగ్ డీల్స్‌తో, ముఖ్యంగా టెలివిజన్ హక్కులకు సంబంధించి వినోద పరిశ్రమలో గేమ్ ఛేంజర్‌గా మారింది. 
 
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే భారీ స్థాయిలో నిర్మాణాలు చేపట్టి వార్తల్లో నిలిచింది. రూ.500 కోట్ల బడ్జెట్‌తో 'పుష్ప 2' భారతీయ సినిమాల్లో అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. దీని టెలివిజన్ హక్కులను జయంతిలాల్ గడా పెన్ స్టూడియోస్ కొనుగోలు చేసింది.
 
"పుష్ప 2" డిజిటల్ రైట్స్ కూడా సంచలనం సృష్టించాయి. 275 కోట్ల రూపాయలకు నెట్‌ఫ్లిక్స్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రన్ తర్వాత, ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంటుంది. ఈ యాక్షన్-ప్యాక్డ్ డ్రామా కోసం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.