గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 3 ఆగస్టు 2018 (09:26 IST)

ఒక్కడు మూడుముళ్లు వేస్తే.... ఊరంతా అనుభవిస్తారు.. ఎవరిని?

దేవదాసి, బసివిని, మాతంగి... పేరేదైనా.. వారి బతుకులు మాత్రం దుర్భరం. ఎప్పుడో... ఎవరో సృష్టించిన అనాగరిక ఆచారానికి బలైపోయిన మహిళలు వారు. అక్షర జ్ఞానం లేని తల్లిదండ్రులు చేసిన తప్పునకు శిక్ష అనుభవిస్తున్

దేవదాసి, బసివిని, మాతంగి... పేరేదైనా.. వారి బతుకులు మాత్రం దుర్భరం. ఎప్పుడో... ఎవరో సృష్టించిన అనాగరిక ఆచారానికి బలైపోయిన మహిళలు వారు. అక్షర జ్ఞానం లేని తల్లిదండ్రులు చేసిన తప్పునకు శిక్ష అనుభవిస్తున్న దేవదాసీలు వారు. పేరుమారి... సమాజం తీరు మారి.. తమ బతుకులే మారిపోయాక... తమను మనుషులుగా గుర్తించాలని కోరుతున్న అభాగ్యులు. 
 
అభం శుభం తెలియని పదేళ్ల లోపు బాలికలను ఉలిగమ్మ, యల్లమ్మ, పెన్నోబిలేసు, హనుమంతరాయుడు తదితర దేవాలయాల పేరుతో దేవదాసీలుగా మారుస్తున్నారు. బాలికను పెళ్లికూతురుగా అలంకరించి  దేవాలయానికి తీసుకెళతారు. సంప్రదాయం పేరుతో వరుసకు మామ అయ్యే వ్యక్తితో గానీ, లేక ఊరి పెద్దతో గానీ తాళి కట్టించి దేవుడికి వదిలేస్తారు. ఆ తర్వాత ఊరంతా ఆ దేవదాసిని అనుభవిస్తుంటారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఈ దేవదాసిలు అధికంగా ఉన్నారు. ముఖ్యంగా, జిల్లాలోని 11 మండలాల్లో దాదాపు 2,529 మంది జోగినులు, బసివినులు, దేవదాసీలు ఉన్నట్లు అధికారుల రికాకార్డులు చెబుతున్నాయి. వీరిలో ఓ దేవదాసి తమ బతుకు గురించి వివరించింది. ఆమె బాధ ఆమె మాటల్లోనే... 
 
'నేను 12వ యేటనే పుష్పావతి అయ్యాను. 17వ రోజున తల్లిదండ్రులో గ్రామ పెద్ద నివశించే గుడిసెకు తీసుకెళ్లి వదిలిపెట్టి వచ్చారు. నిజానికి అలా ఎందుకు వదిలారో నాకు తెలియదు. ఆ రాత్రికి అక్కడే బస చేయమన్నారు. ఇంతలోనే కామంతో కళ్లుమూసుకునిపోయిన ఆ గ్రామపెద్ద చేతిలో తన కన్నెరికం చెదిరిపోయింది. 
 
అంటే... నా తల్లిదండ్రులే నన్ను వ్యభిచార రొంపిలోకి దించారని, నన్ను అంగడి బొమ్మగా మార్చారని అపుడే తెలుసుకున్నారు. ఇక ఆనాటి నుంచి నా జీవితం రోజు నరకప్రాయమే. ఎవరు పడితే వారు నన్ను పిలిచే వారు. ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే వారు కూడా వెళ్లిరామ్మా అని చెప్పేవారు. 
 
అలా చివరకు గ్రామంలో నన్ను వ్యభిచారిగా ముద్ర వేశారు. గౌరవం లేదు, మర్యాదా లేదు. దారెంట పోయే ప్రతి కామపిశాచి నాతో కామవాంఛ తీర్చుకుంటున్నారు. ఇప్పటికీ నా పరిస్థితి ఇదే. ఇలా నా జీవితం దుర్భరంగా మారింది అని అంబాపురం గ్రామానికి చెందిన ఓ దేవదాసి చెప్పుకొచ్చింది.