బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 31 జులై 2018 (18:41 IST)

బాలింతను డోలీలో కట్టి... కొండమార్గం.. జోరువానలో 12 కి.మీటర్లు మోసిన భర్త.. శిశువు మృతి

గిరిపుత్రులకు కనీస వసతులు కరువైనాయి. విద్య, వైద్య అవసరాలు కూడా లేకుండా గిరిపుత్రులు నానా తంటాలు పడుతున్నారు. తాజాగా ఓ బాలింతను ఆస్పత్రికి తరలించేందుకు 12 కిలోమీటర్ల మేర భర్త మోసాడు. వివరాల్లోకి వెళితే

గిరిపుత్రులకు కనీస వసతులు కరువైనాయి. విద్య, వైద్య అవసరాలు కూడా లేకుండా గిరిపుత్రులు నానా తంటాలు పడుతున్నారు. తాజాగా ఓ బాలింతను ఆస్పత్రికి తరలించేందుకు 12 కిలోమీటర్ల మేర భర్త మోసాడు. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లాలోని గిరిజన ప్రాంతంలో ఓ బాలింతను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు నరకయాతన అనుభవించారు.


సాలూరు మండలం సిరివరకు చెందిన జిందమ్మ అనే గిరిజన మహిళ నెలలు నిండకుండానే ప్రసవించింది. నెలలు నిండకుండానే కాన్పు కావడంతో తీవ్ర రక్తస్రావం కావడంతో, బిడ్డ మృతి చెందగా తల్లి అపస్మారక స్ధితిలోకి వెళ్లింది. 
 
నెలలు నిండకుండానే కాన్పు కావడంతో పుట్టిన కొద్దిసేపటికే శిశువు కన్నుమూసింది. మరోవైపు జిందమ్మకు తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో భర్త, సోదరుడు, స్థానికులు ఆమెను రక్షించేందుకు నడుం బిగించారు.

డోలీకట్టి అందులో జిందమ్మను ఉంచి సోమవారం 12 కిలోమీటర్లకు పైగా కొండ మార్గంలో జోరు వర్షంలో నడిచి దుగ్గేరు ఆసుపత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యాధికారుల సూచనల మేరకు ఆమెను 108లో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం విజయనగరానికి తరలించనున్నట్లు సమాచారం.
   
జిందమ్మకు పుట్టిన కొడుకు చనిపోవడంతో ఆమె సోదరుడు ఆవేదన చెందుతున్నాడు. తన సోదరిని బ్రతికించుకోడానికి తమ కుటుంబ సభ్యులంతా ఏ విధంగా శ్రమించారో మీడియాకు వివరించాడు. గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికైనా వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నాడు.