శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 23 జులై 2018 (16:57 IST)

ఇంట్లో అయితే పట్టుకుంటారని అక్కడ పెట్టాడు... దొరికేసరికి కాళ్ల మీద పడ్డాడు...

అబ్బో... ధనం ఓ స్థాయిని మించితే దాన్ని ఎక్కడ దాచిపెట్టాలో అర్థంకాక తలలు బాదుకోవాల్సి వస్తుందనడానికి ఇదో ఉదాహరణ. బెంగళూరు లోని ఓ ప్రతిష్టాత్మకమైన బ్యాడ్మింటన్ క్లబ్ అయిన బోరింగ్ క్లబ్‌లోని లాకర్లలో క్రీడా సామగ్రికి బదులు అతడు పెట్టినవేమిటో చూసినప్పుడు

అబ్బో... ధనం ఓ స్థాయిని మించితే దాన్ని ఎక్కడ దాచిపెట్టాలో అర్థంకాక తలలు బాదుకోవాల్సి వస్తుందనడానికి ఇదో ఉదాహరణ. బెంగళూరు లోని ఓ ప్రతిష్టాత్మకమైన బ్యాడ్మింటన్ క్లబ్ అయిన బోరింగ్ క్లబ్‌లోని లాకర్లలో క్రీడా సామగ్రికి బదులు అతడు పెట్టినవేమిటో చూసినప్పుడు నిర్వాహకులు షాక్ తిన్నారు. ఇంతకీ ఆ లాకర్లలో ఏమున్నదో తెలుసా? రూ. 800 కోట్ల విలువైన బ్లాంక్ చెక్కులు, ఇతర ఆస్తి పత్రాలు, బంగారు నగలు, రూ. 8 కోట్ల విలువైన వజ్రాలు.
 
ఇదంతా బెంగళూరులోని ఓ చిన్న వ్యాపారవేత్త అయిన అవినాశ్ అమర్‌లాల్ కుఖ్రేజా వ్యవహారం. ఇతగాడు తన వ్యాపార లావాదేవీలు, డబ్బు, అక్రమ సంపాదన అంతా ఇంట్లో పెడితే పట్టుకుంటారనీ, వాటిని కాస్తా మెల్లిగా బ్యాడ్మింటన్ క్లబ్బుకు తరలించాడు. ముందుగా సభ్యత్వం తీసుకుని కొన్నాళ్లపాటు అలా వస్తూపోతూ మెల్లిగా డబ్బు, పత్రాలు, వజ్రాలు అన్నీ లాకర్లకు చేర్చేశాడు. ఐతే ఆ లాకర్ల గడువును పెంచుకుంటే సరిపోయేది. సోమరిపోతుతనంతో పట్టుబడ్డాడు. నిర్వాహకులు లాకర్ల గడువును పెంచుకోవాలని ఎన్నిసార్లు ఫోన్లు చేసినా పట్టించుకోలేదు. దాంతో విసుగుచెందిన నిర్వాహకులు వాటిని మరొకరికి అప్పగించేందుకు సదరు లాకర్ తాళాలను తీసి చూడాగా కళ్లు జిగేల్మన్నాయి.
 
వజ్రాలు, బంగారు, నగదు అంతా చూసి కంగు తిన్నారు. చివరికి విషయాన్ని నేరుగా పోలీసులకు చేరవేయడంతో వాళ్లు రంగంలోకి దిగారు. ఈలోపుగానే అవినాష్ విషయాన్ని తెలుసుకుని పరుగుపరుగున వచ్చి నిర్వాహకుల కాళ్లపై పడి డబ్బు పోతే పోయింది ఆ పత్రాలనైనా కనీసం ఇవ్వండి అంటూ ప్రాధేయపడ్డాడు. కానీ నిర్వాహకులు అతడి చెప్పింది పట్టించుకోలేదు. పోలీసులకు అప్పగించేశారు. ఇంకా అతడికి మరోచోట లాకర్ వున్నదని తెలుసుకుని అక్కడ కూడా తనిఖీ చేసేందుకు పోలీసులు వెళ్లారు. మొత్తమ్మీద ఓ సామాన్యమైన బ్యాడ్మింటన్ క్లబ్బు లాకర్లలో కోట్లలో డబ్బు, బంగారం, వజ్రాలు బయటపడటం బెంగళూరులో సంచలనం సృష్టిస్తోంది.