గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 అక్టోబరు 2022 (11:51 IST)

కొనుగోలు చేసిన భూముల అమ్ముకోవడానికే విశాఖ రాజధాని నాటకం : దేవినేని

devineni uma
తాము కొనుగోలు చేసిన భూములను అమ్ముకోవడానికే విశాఖ రాజధాని అంటూ వైకాపా నేతలు నాటకమాడుతున్నారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. ఇందుకోసం రాజధాని పేరుతో మూడు ముక్కలాటకు తెరతీశారని ఆరోపించారు. 
 
ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మూడు రాజధానుల కోసం ఒక్క వైకాపా ఎమ్మెల్యేనే రాజీనామా అంటున్నారంటే, మిగతా 150 మంది అమరావతికి అనుకూలమే కదా? అని సందేహం వ్యక్తం చేశారు. విశాఖలో భూములు లేవన్న విజయసాయి రెడ్డి ఎక్కడున్నారని ప్రశ్నించారు. 
 
భారీగా భూములు కొన్నది ఆయన అల్లుడు, కూతురేనని ఉమా ఆరోపించారు. క్యాంపు కార్యాలయాన్ని సిద్ధం చేసుకుని వెళ్లిపోవడానికి ముఖ్యమంత్రి సిద్ధమవుతున్నారని అనుమానం వ్యక్తంచేశారు. పంచాయతీల్లో సొమ్ముల్లేక వైకాపా సర్పంచులే భిక్షాటన చేసుకోవడం ప్రభుత్వతీరుకు నిదర్శనమన్నారు.