ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

వైకాపా నేత దారుణ హత్య - గొడ్డలితో నరికి చంపిన దుండగులు

murder
ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైకాపా నేత రామకృష్ణారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను గొడ్డళ్ళతో నరికి చంపేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రామకృష్ణారెడ్డిని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. 
 
పురం మాజీ సమన్వయకర్తగా పనిచేసిన చౌళూరు రామకృష్ణారెడ్డి స్వగ్రామం హిందూపురం మండలంలోని చౌళూరులో శనివారం రాత్రి 9 గంటల సమయంలో ఆయనపై దుండగులు వేటకొడవళ్లు, గొడ్డళ్ల, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. 
 
కారు నుంచి దిగగానే కళ్లలో కారం చల్లి దాడికి పాల్పడినట్లు సమాచారం. అధికార పార్టీలోని వర్గకక్షలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు. తన కుమారుడి హత్యకు ఎమ్మెల్సీ ఇక్బాల్‌ కారణమని రామకృష్ణారెడ్డి తల్లి నారాయణమ్మ ఆరోపించారు.