శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 23 ఆగస్టు 2019 (08:30 IST)

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్

సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసారు. జాతీయ మీడియా వ్యవహారాలు , అంతర్రాష్ట్ర వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతను కూడా అమర్ కు అప్పగించారు.
 
అమర్ దేవులపల్లి మదన్ మోహనరావు మరియు సరస్వతి దంపతులకు జన్మించారు. వీరు బి.ఏ. పూర్తిచేసిన తర్వాత జర్నలిజంలో  కూడా పట్టా పొందారు
 
దేవులపల్లి అమర్ 1975లో ప్రజాతంత్ర  పత్రికకు కరస్పాండెంట్ గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత ఆంధ్రప్రభ స్టాఫ్ రిపోర్టర్ గా కొంత కాలం పాటు పనిచేసి   సంపాదకునిగాఎదిగారు.
 
 వీరు ఈనాడు, ఉదయం, ఆంధ్ర భూమి మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్  పత్రికలలో పనిచేశారు . ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్  పదవి కూడా అమర్ పనిచేశారు. 
 
ప్రస్తుతం అమర్ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడుగా వున్నారు. ఐజెయు లో కీలక పాత్ర పోషిస్తున్నారు.