ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 5 మే 2020 (21:09 IST)

కంటైన్మెంట్ జోన్ ప్రజలకు డీజీపీ మాస్క్ ల పంపిణీ

విన్సెంట్  ఫెర్రర్ స్థాపించిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సంస్థ అనంతపురం కేంద్రంగా  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని నిరుపేదల అభివృద్ధికి గత 50 సంవత్సరాలుగా విశేషమైన కృషి చేస్తూ ముందుకు సాగుతోంది.

ఈ సంస్థ ప్రస్తుతం కరోనా వైరస్ నియంత్రణలో  భాగంగా తమవంతు సహాయంగా రాష్ట్ర డీజీపీ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి  150,000 మాస్క్ లను అందించడం జరిగింది.

తాము అందించిన మాస్క్ లను పోలీస్ శాఖ సహకారంతో  కంటైన్మెంట్ జోన్ల పరిధిలో ఉన్న ప్రజలకు అందజేయాల్సిందిగా వారు ప్రభుత్వాన్ని, రాష్ట్ర డీజీపీని  కోరడంతో, మంగళగిరి లోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు సదరు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.

ఈ సంధర్భంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు గౌతమ్ సవాంగ్, విపత్కర పరిస్థితులలో సహాయ సహకారాలను అందిస్తున్న ట్రస్ట్ ప్రతినిధులకు ప్రభుత్వం తరపున, పోలీసు తరుపున కృతజ్ఞతలు తెలిపారు.

ఈ విపత్కర పరిస్థితులలో ఇటువంటి సాయం పలువురికి స్ఫూర్తిని కలిగిస్తుందని  ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రవిశంకర్ అయ్యనార్, శ్రీధర్ రావ్, నాగేంద్ర కుమార్, మహేష్ చంద్ర లడ్డ లతో పాటు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సభ్యులు ప్రమీల కుమారి, రామేశ్వరి, సౌజన్య మరియు రామారావు పాల్గొన్నారు.
 
కంటైన్మెంట్ జోన్లలో పర్యటన: 
డీజీపీ సవాంగ్, సీపీ ద్వారకా తిరుమల రావు, కలెక్టరు ఇంతియాజ్, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్  కృష్ణ లంక, కార్మిక నగర్ ఏరియా లను సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు.

ఈ సందర్భంగా, వాలంటీర్ లకు సమకూర్చిన మాస్క్ లను అందచేసి, అక్కడి ప్రజలకు పంపిణీ  చేయవలసిందిగా నిర్దేశించారు. అక్కడ ప్రజల సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు.