గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 11 డిశెంబరు 2020 (08:27 IST)

డిసెంబ‌రు 12న‌ 'డ‌య‌ల్ యువ‌ర్ ఈవో'

డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం డిసెంబ‌రు 12వ తేదీన శ‌నివారం తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భవనంలో జరుగనుంది. ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం ఉంటుంది. 

ఈ  కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి‌కి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.
 
నేడు వైకుంఠ ఏకాద‌శి ఆన్‌లైన్‌ టికెట్ల కోటా విడుదల
వైకుంఠ ఏకాదశి సందర్బంగా డిసెంబర్ 25 నుండి జనవరి 3వ తేదీ వరకు 300/- రుపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను శుక్రవారం టీటీడీ విడుదల చేయనుంది. 
 
రోజుకు 20 వేల టికెట్ల చొప్పున 2 లక్షల టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. టీటీడీ www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా భ‌క్తులు టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.