శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 11 డిశెంబరు 2020 (08:11 IST)

వైజాగ్‌లో శ్రీ‌వారి కార్తీక స‌హ‌స్ర దీపోత్స‌వానికి విస్తృత ఏర్పాట్లు

వైజాగ్ ఆర్‌కె బీచ్ రోడ్‌లోని ఎంజిఎం గ్రౌండ్స్‌లో డిసెంబ‌రు 11న శుక్ర‌వారం జ‌రుగ‌నున్న శ్రీ‌వారి కార్తీక స‌హ‌స్ర దీపోత్స‌వానికి టిటిడి విస్తృతంగా ఏర్పాట్లు చేప‌ట్టింది. 
 
కోవిడ్-19 నేప‌థ్యంలో భౌతిక‌దూరం పాటిస్తూ 800 మంది మ‌హిళ‌లు దీపాలు వెలిగించేలా ఏర్పాటుచేశారు. వేదిక‌ను శోభాయ‌మానంగా పుష్పాల‌తో, విద్యుత్ దీపాల‌తో అలంక‌రించారు. ఇంజినీరింగ్ విభాగం ఆధ్వ‌ర్యంలో మైదానంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు.
 
సాయంత్రం 6 నుండి రాత్రి 8.15 గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది. ఇందులో భాగంగా వేద‌స్వ‌స్తి, సంకీర్త‌న గానం, పుణ్యాహ‌వ‌చ‌నం/అగ‌్నిప్ర‌తిష్ట‌, శ్రీ సూక్తహోమం, శ్రీ ల‌క్ష్మీ చ‌తుర్వింశ‌తి నామావ‌ళితో అర్చ‌న నిర్వ‌హిస్తారు.

ఆ త‌రువాత అష్ట‌ల‌క్ష్మీ స్తోత్ర కూచిపూడి నృత్యం, దీపారాధ‌న‌, సామూహిక దీప‌నీరాజ‌నం, గోవింద‌నామాలు, న‌క్ష‌త్ర హార‌తి, కుంభ హార‌తి, క‌ర్పూర‌‌హార‌తి ఇస్తారు.