గురువారం, 9 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : సోమవారం, 6 అక్టోబరు 2025 (15:27 IST)

Prabhas: రాజా సాబ్ ట్రైలర్ కు రెస్పాన్స్ - యూరప్ లో ప్రభాస్ తో రెండు పాటల చిత్రీకరణ

Raja Saab trailer Response poster, Europe tour Maruti and son
Raja Saab trailer Response poster, Europe tour Maruti and son
రెబల్ స్టార్ ప్రభాస్ భారీ పాన్ ఇండియా మూవీ రాజా సాబ్ ట్రైలర్ రీసెంట్ గా రిలీజై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. 40 మిలియన్ల ప్యూస్ కు పైగా వచ్చిందని చిత్ర యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది. అదే విధంగా ప్రభాస్ తోపాటు హీరోయిన్లపై రెండు పాటల చిత్రీకరణ చేయనున్నారు. ఇందుకోసం దర్శకుడు మారుతీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎస్.కె.ఎన్. యూరప్ వెలుతున్న పొటోలను షేర్ చేశారు. మరో వైపు చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. ఇంకోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సాగుతున్నాయి.
 
జనవరి 9న థియేటర్స్ లోకి రాబోతున్న రాజా సాబ్ కోసం వరల్డ్ క్లాస్ మేకింగ్ క్వాలిటీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ స్టాండర్డ్స్ ను చూపించింది. దర్శకుడు మారుతి ప్రభాస్ తో వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ అనిపించే సినిమా రూపొందించినట్లు రాజా సాబ్ ట్రైలర్ ప్రూవ్ చేస్తోంది. తనకు ఇష్టమైన రొమాంటిక్ హారర్ కామెడీ జానర్ లో తన ఫేవరేట్ హీరో ప్రభాస్ ను మారుతి వెర్సటైల్ గా చూపించారు. తమన్ బీజీఎంలోని వేరియేషన్స్ రాజా సాబ్ ట్రైలర్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.
 
రాజా సాబ్ కు ముగ్గురు హీరోయిన్స్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్  కావాల్సినంత గ్లామర్ ను యాడ్ చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులు రాజా సాబ్ ను ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు వెయిట్ చేస్తున్నారు.