శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 3 అక్టోబరు 2015 (08:50 IST)

స్నేహితుల మధ్య ఘర్షణ... పొట్టలో దిగిన కత్తి తీసి.. పొడిచి పోడిచి చంపాడు.. ఎక్కడ?

తన పొట్టలో దిగిన కత్తిని తీసి తనపై దాడి చేసిన వ్యక్తిని పొడిచి పొడిచి చంపాడు.. ఇలాంటి సంఘటనలు సాధారణంగా సినిమాల్లో తప్ప మరెక్కడ కనిపించవు. కానీ హైదరాబాద్‌లో ఇద్దరు స్నేహితుల మధ్యన జరిగిన ఘర్షణ ఈ సన్నివేశాన్ని ఆవిష్కరించింది. వివరాలిలా ఉన్నాయి. 
 
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఇబ్రహీం, అలీఅఫారీలు స్నేహితులు. ఇద్దరి మధ్యన ఒక గుర్రపు బగ్గీ అమ్మకం విషయంలో తేడాలొచ్చాయి. ఇబ్రహీంను అలీఆఫారీ బాలాపూర్ పిలిపించాడు. ఏ మాత్రం అనుమానం కలగని ఇబ్రహీం అక్కడకు వెళ్ళాడు. అయితే కొద్దిసేపటి తరువాత అలీఆఫారీ కత్తితో ఇబ్రహీంపై దాడి చేశాడు. తన శరీరం దిగిన కత్తి తీసిన ఇబ్రహీం ఎదురు దాడికి దిగాడు. 
 
అలీఅఫారీపై విరుచుకుపడ్డారు. మధ్యలో అడ్డువచ్చిన మరో స్నేహితుడిపై కూడా దాడి చేశాడు. తీవ్రగాయా అలీ అఫారీని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు.