ఎంపీ రఘురామ కృష్ణం రాజుపై అనర్హత వేటు వేయండి
ఎంపీ రఘురామ కృష్ణం రాజు పై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ను వైసీపీ ఎంపీలు డిమాండు చేశారు. ఆర్.ఆర్.ఆర్. పై వేసిన అనర్షత నోటీస్‌ను వెంటనే అమలు చేయాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను గురువారం ఢిల్లీలో కలిసి విజ్ణ్నప్తి చేశారు.
వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి, మార్గాని భరత్ లు లోక్ సభ స్పీకర్ తో సమావేశం అయ్యారు. రఘురామ కృష్ణంరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వివరించారు. దానికి సంబంధించిన ఆధారాలను ఓం బిర్లాకు సమర్పించారు. ఇక ఆయన్ని ఉపేక్షించవద్దని, వెంటనే ఎంపీ రఘురామ కృష్ణం రాజు లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.
అయితే, దీనికి రెండు రోజుల ముందే ఎంపీ రఘరామ కృష్ణం రాజు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన సంగతి విదితమే. ఆయనపై వైసీపీ ఇచ్చిన అనర్హత నోటీస్ చెల్లదని, తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. తాను పార్టీలో, ప్రభుత్వంలో జరుగుతున్న కొన్ని పరిణామాలను ప్రశ్నించినందుకే, తనపై పార్టీ వర్గాలే దాడి చేస్తున్నాయని ఆయన స్పీకర్ కు తెలియజేసినట్లు సమాచారం. అయితే, ఇపుడు ముగ్గురు ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాను కలిసి, రఘు రామకృష్ణంరాజుపై వేటు వేయాలని కోరడంతో దీనిపై స్పీకర్ ఏలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.