ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 11 మే 2020 (20:57 IST)

అసెంబ్లీ కార్యాలయ శానిటరీ ఉద్యోగులకు నిత్యావసర వస్తువుల పంపిణీ

కరోనా వ్యాధి కారణంగా నిత్యావసర సరకుల కొరతను ఎదుర్కొంటున్న అసెంబ్లీ కార్యాలయ శానిటరీ ఉద్యోగులకు  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నిత్యావసర వస్తువులను పంపిణీ చేసింది.

ఈరోజు  అసెంబ్లీ సెక్రటరీ పి.బాలకృష్ణమాచార్యుల చేతుల మీదుగా అసెంబ్లీ ఆవరణలో అసెంబ్లీ కార్యాలయ శానిటరీ ఉద్యోగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

కార్యక్రమంలో అసెంబ్లీ సెక్రటరీ పి.బాలకృష్ణమాచార్యులతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉద్యోగుల సంక్షేమ సంఘం సభ్యులు, అసెంబ్లీ కార్యాలయ శానిటరీ ఉద్యోగులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.