శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 4 మార్చి 2020 (08:12 IST)

ఎన్పీఆర్‌పై అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం: జగన్‌

జాతీయ జనాభా పట్టికలో(ఎన్పీఆర్‌) ప్రతిపాదించబడ్డ కొన్ని ప్రశ్నలు రాష్ట్రంలోని మైనారిటీల్లో అభద్రతా భావాన్ని కలుగజేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.

ఎన్పీఆర్‌పై మైనారిటీల్లో నెలకొన్న ఆందోళనకు సంబంధించి సీఎం వైఎస్‌ జగన్‌ ట్విటర్‌లో స్పందించారు. ఎన్పీఆర్‌ అంశంపై తమ పార్టీలో విస్తృతమైన చర్చ జరిపామని పేర్కొన్నారు. ఎన్పీఆర్‌కు సంబంధించి 2010లోని నిబంధనలనే ఇప్పుడు కూడా పాటించాలని కేంద్రాన్ని కోరాతామని అన్నారు.

ఇందుకు సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని వెల్లడించారు. తాడేప‌ల్లిలోని విడిది కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను ముస్లిం ప్రతినిధులు అల్తాఫ్ అలీ రాజా త‌దిత‌రులు కలిశారు.

ఈ సందర్భంగా వారు ఎన్‌పిఆర్‌పై ఆందోళన వ్యక్తం చేశారు.  ఆ కొద్ది సేపటికే జగన తన నిర్ణయాన్ని ప్రకటించడం విశేషం.