శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , బుధవారం, 29 మార్చి 2017 (08:52 IST)

ఇక్కడా చంద్రబాబు పేరు వాడుకున్నారా.. బాంబు పేల్చిన కవిత!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో పరిచయాలను వాడుకుని మేలు చేకూర్చాలని ఒత్తిడి చేస్తున్నారంటూ సినీ నటి, తెలుగుదేశం పార్టీ నాయకురాలు కవిత నేరుగా పోలీసు స్టేషన్ తలుపు తట్టడం సంచలనం కలిగిస్తోంది.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో పరిచయాలను వాడుకుని మేలు చేకూర్చాలని ఒత్తిడి చేస్తున్నారంటూ సినీ నటి, తెలుగుదేశం పార్టీ నాయకురాలు కవిత నేరుగా పోలీసు స్టేషన్ తలుపు తట్టడం సంచలనం కలిగిస్తోంది. నవ్యాంధ్రప్రదేశ్‌ చలన చిత్ర వాణిజ్య మండలి(ఫిలించాంబర్‌)ని స్థాపించిన అధ్యక్షుడు ఎస్వీఎస్ రావు తన పరువుప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నాడని ఆరోపిస్తూ ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేస్తూ, బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
కవిత చెబుతున్న దాన్ని బట్టి, టాలీవుడ్‌లో ప్రొడజ్ఞన్ మేనేజరుగా పనిచేసిన ఎస్‌వీఎస్ రావు రాష్ట్ర విభజనం అనంతరం తన అధ్యక్షతన నవ్యాంధ్ర ప్రదేశ్ ఫిలిం చాంబర్ కార్యాలయం చెరిచాడు. పలువురు నిర్మాతలు, దర్శకులు, ఔత్సాహికులను సభ్యులుగా చేర్చుకుని సంస్థ పేరిట డబ్బులు వసూలు చేశాడు. పైగా తనకు తెలియకుండానే ఆ సంస్థకు వైస్‌ ప్రెసిడెంట్‌గా  నియమించాడని, అయితే ఈ సంస్థకు ఎలాంటి హక్కులు లేవని తెలుసుకొని రాజీనామా చేసినట్లు కవిత చెప్పారు. 
 
రాజీనామా వెనక్కు తీసుకోవాలని తనపై ఒత్తిడి చెచ్చినా తాను అంగీకరించకపోవడంతో గత మూడు రోజులుగా ఫేస్‌బుక్‌లో తనపై దుష్ప్రచారం చే్స్తూ రెండు కరపత్రాలు పెట్టాడని కవిత ఆరోపించారు. సీఎం చంద్రబాబు, కేంద్రమంతులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయతో తనకున్న పరిచయాలను వినియోగించి నవ్యాంధ్రప్రదేశ్‌ ఫిలించాంబర్‌కు హక్కులు కల్పించాల్సిందిగా కోరగా అందుకు తాను అంగీకరించలేదన్నారు.
 
తను స్థాపించిన సంస్థకు సీఎం చంద్రబాబు ఆశీస్సులు ఉన్నాయని నమ్మిస్తూ ఎస్‌వీఎస్ రావుడబ్బులు వసూలు చేశారని కవిత ఆరోపించారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న రావుపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 
రాష్ట్ర సీఎం చంద్రబాబు పేరు ఇలాంటి పనులకు కూడా వాడుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకురాలు కవితే స్వయంగా పేర్కొనడం టీడీపీకి బాగా ఇబ్బంది కలిగించే విషయమే మరి.