సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 17 ఏప్రియల్ 2021 (20:00 IST)

పెద్దిరెడ్డికి ఎన్నికల నిబంధనలు వర్తించవా? : కొమ్మారెడ్డి పట్టాభిరామ్

తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైనప్పటినుంచీ వైసీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఎలాఖూనీచేస్తున్నారో ఉదయంనుంచి తిరుపతిసహా, పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో చూస్తూనేఉన్నామని, టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. శనివారం ఆయన మంగళగి రిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 

ఆ వివరాలు ఆయన మాటల్లోనే మీకోసం...!
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, వేలాదిగా ఇతరప్రాంతాలనుంచి దొంగఓటర్లను తరలిస్తున్న దృశ్యాలను, అందుకు సంబంధించిన ఆధారాలను టీడీపీ ఆధారాలతోసహా బయటపెట్టింది. దొంగ ఓటర్ల తరలింపుసహా, పోలింగ్ బూత్ లలో వారుచేస్తున్న హాడావిడిని మీడియాముందుంచాము.  ఇతరప్రాంతాలనుంచి వందలాది బస్సుల్లో వైసీపీ కార్యకర్తలను, దొంగఓటర్లను తిరుపతి పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలకు పెద్దఎత్తున తరలించారు.

దొంగఓటర్లను తరలిస్తుంటే తిరుపతిలో ఉన్న టీడీపీ నేతలు అడ్డుకున్నారు. అక్కడ జరుగుతున్న దారుణాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ ట్వీట్ ద్వారా స్పందిస్తే,  తేలుకుట్టినా దొంగలాగా కనపడుతున్న పెద్దిరెడ్డి పట్టలేని ఉక్రోషంతో మీడియాలో స్పందించాడు. అసలు స్థానికేతరుడైన పెద్దిరెడ్డికి ఈరోజు తిరుపతిలో ఏంపని? తిరుపతి పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న దొంగఓటర్ల ప్రక్రియపై లోకేశ్ స్పందిస్తే, ఆయన  ట్వీట్ పై ఉక్రోషం పట్టలేక పెద్దిరెడ్డి తిరుపతిలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు. 

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి వీరప్పన్ తిరుపతి ఉపఎన్నిక సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నాడు.  పుంగనూరు నియోజకవర్గంలోని ఎర్రతివారిపల్లెగ్రామంలోని  పోలింగ్ స్టేషన్ నెం186లో  పెద్దిరెడ్డికి (పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సన్నాఫ్ లక్ష్మణరెడ్డి) ఓటుంది. తిరుపతిలో ఏంపని? బరితెగించిన పెద్దిరెడ్డి, చేసిన తప్పుకి సిగ్గుపడకుండా, ఇంకా రౌడీయిజానికి పాల్పడుతున్నాడు. తిరుపతిలో ఓటర్ కాని పెద్దిరెడ్డికి అక్కడేం పని?

పెద్దిరెడ్డిని పోలీసులు ఎందుకు వదిలేశారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పోలీసులు ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? తిరుపతిలోకూర్చొని దురాగతాలకు పాల్పడుతున్న పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయకుండా ఎందుకు ఉపేక్షిస్తున్నారు. పుంగనూరుకుచెందిన వ్యక్తి తిరుపతి న్యూబాలాజీకాలనీలోని పీఎల్ ఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఈరోజు  ప్రెస్ మీట్ పెట్టడమేంటి? స్థానికేతరుడైన పెద్దిరెడ్డిని పోలీసులు ఇంకా అక్కడ ఎందుకు ఉండనిచ్చారు?

ఎన్నికల అధికారులు, పోలీసులు స్థానికేతరుడైన పెద్దిరెడ్డిని ఎలా అనుమతించారు? స్థానికేతరులంతా పోలింగ్ రోజున అక్కడ ఉండటానికి అవకాశం లేనప్పుడు, ఇంకా  పెద్దిరెడ్డి అక్కడ ఏం చేస్తున్నాడు?  పెద్దిరెడ్డిని అరెస్ట్ చేసే దమ్ము డీజీపీకి ఉందా? పెద్దిరెడ్డి, స్థానికేతరులైన ఇతర  మంత్రులు, అంతదుర్మార్గంగా తిరుపతి నడిబొడ్డున కూర్చొని  తిరుపతిపార్లమెంట్ తో సంబంధంలేని  ఇతరప్రాంతాలనుంచి వేలాదిమందిని తరలిస్తుంటే, డీజీపీ చోద్యం చూస్తారా?

దొంగఓటర్లను తరలిస్తుంటే అడ్డుకోవాల్సిన పోలీస్ వ్యవస్థ ఏంచేస్తోంది? పెద్దిరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయకుంటే, దానిపర్యవసనాలను పోలీసులు అనుభవించి తీరుతారు. స్థానికేతరుడైన పెద్దిరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయకుంటే, పోలీసులు తీరుపై కేంద్రఎన్నికలసంఘానికి ఫిర్యాదుచేస్తాం.  దొంగఓటర్లను తరలించడం ద్వారా పెద్దిరెడ్డి సరికొత్త స్మగ్లర్ అవతారమెత్తాడు.

తిరుపతి పార్లమెంట్ పరిధిలో అనేక నియోజకవర్గాల్లో, అనేక పోలింగ్ కేంద్రాల్లో దొంగఓటర్లు ఉన్నట్లు ఆధారాలతోసహా బయటపెట్టినా పోలీస్ వ్యవస్థ స్పందించలేదు.  తిరుపతి ఉపఎన్నిక పరిశీలిస్తున్న అధికారులంతా తక్షణమే పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకోవాలి.  నిన్నటివరకు ఎర్రచందనం, ఇసుక స్మగ్లర్ గా ఉన్న పెద్దిరెడ్డి, నేడు దొంగఓటర్లను తరలించే స్మగ్లర్ గా కొత్త అవతారమెత్తాడు.

ఖబడ్దార్ పెద్దిరెడ్డి.. మాటలు అదుపులో పెట్టుకో... మంత్రిగా ఉన్నాను కదా అని విర్రవీగకు, నీ పదవవి శాశ్వతంకాదు, ప్రజలంతా తరిమికొట్టేరోజు దగ్గర్లోనే ఉందని తెలుసుకో. లోకేశ్ ని విమర్శిస్తే చూస్తూ ఊరుకోము. అంతవయసొచ్చినా ఇంకా సిగ్గులేకుండా చేసినతప్పుని సమర్థించుకోవడానికి పెద్దిరెడ్డికి సిగ్గుండాలి. వందలాది బస్సుల్లో  దొంగఓటర్లను తరలిస్తుంటే అడ్డుకోకుండా పల్లకీలో పోలింగ్ స్టేషన్లకు తీసుకెళ్లాలా? తప్పనిసరిగా, అడుగడుగునా టీడీపీనేలతో పాటు, ప్రజలుకూడా దొంగఓటర్లను అడ్డుకుంటున్నారు. 

కొన్నిఛానళ్లపై పెద్దిరెడ్డి అక్కసు వెళ్లగక్కాడు.  దొంగమీడియాసాక్షిలానే మీడియా మొత్తం  ఉండాలని పెద్దిరెడ్డి అనుకుంటున్నాడా? బులుగు మీడియాలాగా, సాక్షిలాగా మిగతా మీడియాసంస్థలు కూడా దొంగవార్తలు ప్రసారం చేస్తాయని పెద్దిరెడ్డి భావిస్తున్నాడా? నిజాయితీ , దమ్మున్న ఛానళ్లన్నీ పెద్దిరెడ్డి దురాగతాలను ప్రశ్నిస్తూనే ఉంటాము. పెద్దిరెడ్డి ఎంతలా ఏడ్చినా, విషం చిమ్మినా మీడియాను నియంత్రించలేడు. ఆ విషయం పెద్దిరెడ్డి గుర్తుపెట్టుకోవాలి. మీడియాపై  ఉక్రోషం వెళ్లగక్కి, నోటికొచ్చినట్టు  టీడీపీనేతలపై పిచ్చిప్రేలాపనలు పేలితే, పెద్దిరెడ్డి అందుకు తగిన పర్యవసానాలు అనుభవిస్తాడు.

మూల్యంచెల్లించుకొని తీరుతాడు. తాము ప్రతిదీ ఆధారాలతోనే మాట్లాడుతున్నాం.   నకిలీఓటర్ కార్డులు పట్టుకొని పోలింగ్ కేంద్రాలముందున్న దొంగ ఓటర్లను మీడియాకు, అధికారులకు, పోలీసులకు అప్పగించినా, సిగ్గుతో చావకుండా  ఇంకా దబాయిస్తారా? తెలుగుదేశంపార్టీ ఎల్లప్పుడూ ప్రజాస్వామ్యబద్ధంగానే పనిచేస్తుంది. వైసీపీలా ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడవదు.  ప్రజలరక్తాన్ని పీల్చుకొనివారిని వేధించడం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం వైసీపీకి అలవాటేకదా?

ఓటమిభయంతో ఆఖరికి ఇంత నీచానికి పాల్పడతారా? వాలంటీర్లను చేతిలోపెట్టుకొని, వారిసాయంతో దొంగఓటర్లను వేలాదిగా పోలింగ్  బూత్ లకు  తరలించి గెలవడమేనా  పెద్దిరెడ్డి సాధించే గెలుపు? ఇదేనా పెద్దిరెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి వారిపరిపాలనపై ఉన్న నమ్మకం, విశ్వాసం. నకిలీఓటర్ కార్డులతో, దొంగఓటర్ల సాయంతోనే 5లక్షల మెజారిటీ సాధించాలని చూస్తున్నారా? పెద్దిరెడ్డి ముమ్మాటికీ స్మగ్లరే.   

దొంగఓటర్లను తరలించే కొత్త అవతారమెత్తిన పెద్దిరెడ్డికి తిరుపతి లో ఉండే హక్కు ఎక్కడిది? పెద్దిరెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. స్థానికేతరుడైన పెద్దిరెడ్డి, తిరుపతి నడిబొడ్డులో ప్రెస్ మీట్ పెడతాడా? ఆయన బరితెగిస్తే, చూస్తూ ఊరుకోవాలా?   పెద్దిరెడ్డిని చూసి భయపడేవాడు ఎవడూ లేడు. స్థానికేతరులుగా ఉన్నరాష్ట్రమంత్రులు తిరుపతిలోఉంటే, ఎన్నికల పరిశీలకులు, పోలీసులు ఏంచేస్తున్నారు? స్పందించని అధికారులపై ఎన్నికలసంఘానికి ఫిర్యాదుచేస్తాం. పెద్దిరెడ్డిని వెంటనే అదుపులోకి తీసుకొని తిరుపతి పార్లమెంట్ పరిధినుంచి తరలించాలని డిమాండ్ చేస్తున్నాం. 

తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైనప్పటినుంచీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. నకిలీ ఓటర్ కార్డులిచ్చి, వందలాది బస్సుల్లో తిరుపతికి, చుట్టుపక్కలున్న నియోజకవర్గాలకు  తరలిస్తున్నారు. బస్సుల్లో వచ్చినవారంతా  నకిలీ ఓటర్లని ఆధారాలతో సహా బయటపెట్టినా పోలీసులు ఎందుకు స్పందించడం లేదు?  ఓటర్ లిస్ట్ లో ఉన్న సీరియల్ నంబర్లను వాలంటీర్ల సాయంతో నకిలీ ఓటర్ కార్డుల వెనుక ముద్రించారు.

చనిపోయినవారు, ఇతరప్రాంతాల్లో ఉంటున్నవారిని గుర్తించి వారిపేర్లతో నకిలీఓటర్ కార్డులను తయారుచేశారు.  వాటి వెనకాల ఓటర్ లిస్ట్లులోని సీరియల్ నంబర్లను ముద్రించారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన పిరికిపంద ముఖ్యమంత్రి, ఓటమిభయంతో  ఈ రకంగా తిరుపతి ఉపఎన్నికలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడు. రాష్ట్ర కేబినెట్ ను, అధికారులను తన గుప్పెట్లో పెట్టుకొని, ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీచేస్తున్నాడో అందరం చూస్తున్నాం. 

రాష్ట్ర మంత్రులు బరితెగించి మీడియాను , ఓటర్లను బెదిరిస్తుంటే పోలీసులు, అధికారులు వారిపై చర్యలు తీసుకోరా? అలా చర్యలు తీసుకోని అధికారులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. ప్రజలంతా ఎటువంటి భయాందోళనలకు లోనుకాకుండా ఓటువేసి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలి. స్వేఛ్చగా, నిజాయితీగా ఎన్నికజరిగేలా టీడీపీ నేతలు, కార్యకర్తలు పనిచేస్తారు. దొంగఓటర్లను అడ్డుకోవడానికి వారు రోడ్లపై గస్తీ కాస్తారు.

ఫిర్యాదుల నిమిత్తం ఎన్నికల కమిషన్ ఏర్పాటుచేసిన సీ-విజిల్ యాప్ ద్వారా తిరుపతి ఉపఎన్నికలో జరిగే అక్రమాలను తిరుపతి పార్లమెంట్ పరిధిలోని వారంతా ఎన్నికలసంఘం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాం.  ఓటువేయకుండా అడ్డుకున్నా, ఓటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగినా వెంటనే తెలియచేయాలని కోరుతున్నా. పెద్దిరెడ్డి లాంటి స్మగ్లర్ పై వెంటనే చర్యలు తీసుకొని, తిరుపతి ఉపఎన్నిక సక్రమంగా, సజావుగా, స్వేచ్ఛాయుతంగా జరిగేలా చూడాలని ఎన్నికలఅధికారులను కోరుతున్నాము.

ప్రజాస్వామ్యబద్ధంగా తిరుపతి ఉపఎన్నిక జరిగేలాచర్యలు తీసుకోవాలని, పెద్దిరెడ్డినివెంటనే డీజీపీ అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. బస్సులలో తరలింపబడిన దొంగఓటర్లు, పట్టుబడిన బస్సులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.