శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 17 మే 2024 (20:43 IST)

కరెంట్ షాక్ తగిలి పడిపోయిన బాలుడు, బ్రతికించిన వైద్యురాలు - video

Doctor Saves Boy Life with CPR in Vijayawada
కరెంట్ షాక్ కొట్టి స్పృహ కోల్పోయిన ఆరేళ్ల బాలుడిని ఓ వైద్యురాలు బ్రతికించారు. వివరాల్లోకి వెళితే... విజయవాడలోని అయ్యప్ప నగర్‌లో విద్యుదాఘాతానికి గురైన ఆరేళ్ల బాలుడి ప్రాణాలను డాక్టర్ రవళి కాపాడారు. ఆమె కాపాడినప్పుడు తీసిన దృశ్యాల తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాయి అనే బాలుడు రోడ్డుపై విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అటుగా వెళుతున్న వైద్యురాలు రవళి, బాలుడి తల్లిదండ్రుల ఆందోళనను గమనించి, వెంటనే చర్యలు చేపట్టారు. డాక్టర్ రవళి వెనువెంటనే రోడ్డుపైనే బాలుడికి సీపీఆర్‌ చేయించింది.
 
ఆమె సకాలంలో ప్రధమ చికిత్స చేసి సాయిని ఆసుపత్రికి తరలించి అవసరమైన చికిత్స అందించారు. ఆమె సకాలంలో అందించిన అమూల్యమైన చికిత్సతో బాలుడు కోలుకున్నాడు. అతడు క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నాడు. డాక్టర్ రవళి చేసిన వైద్య సహాయంపై సోషల్ మీడియాలో ప్రజల నుండి ప్రశంసలు, అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.