శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 నవంబరు 2021 (10:46 IST)

మందుబాబు హల్‌చల్... నడిరోడ్డుపై బాటిల్‌తో తలకేసి కొట్టుకుని..?

ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో మందుబాబు హల్‌చల్ చేశాడు. తాగిన మైకంలో నడిరోడ్డుపై మద్యం బాటిల్‌తో తలకేసి కొట్టుకున్నాడు. తీవ్ర రక్తస్త్రావం అవుతున్నా రోడ్డుపై పోర్లాడుతూ రచ్చ రచ్చ చేశాడు. వివరాల్లోకి వెళితే.. మద్యం తాగిన వ్యక్తిని సమీపించారు. 
 
పోలీసులు వారించినా వినలేదు ఆ మందుబాబు. నడిరోడ్డుపై పడుకుని తనను కొంతమంది కొట్టారంటూ నానా యాగీ చేశారు. ఎంత చెప్పినా వినకపోవడంతో చివరకు పోలీసులు అతన్ని బలవంతంగా అంబులెన్స్ ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఒంగోలు నగరంలోని నెల్లూరు బస్టాండ్ సెంటర్‌లో చోటు చేసుకుంది. 
 
కాగా, ఓ బార్‌లో మద్యం తాగి గొడవపడుతున్నాడని బార్‌ సిబ్బంది యువకుడిని బయటకు పంపడంతో.. రోడ్డుపైకి వచ్చిన యువకుడు నానా బీభత్సం సృష్టించాడు. నడిరోడ్డుపై జరిగిన ఈ సంఘటనతో కొద్దిసేపు ఏం జరుగుతుందో తెలియక స్థానికులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు వచ్చి అతన్ని తీసుకెళ్లడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.