మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 23 ఆగస్టు 2017 (11:09 IST)

చంద్రబాబును చంపాలా..? అయితే జగన్‌పై కేసు నమోదు చేయండి : ఈసీ

చంద్రబాబును చంపాలా..? అయితే జగన్‌పై కేసు నమోదు చేయండి : ఈసీ

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఎన్నికల సంఘం తేరుకోలేని షాకిచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని చంపాలన్నందుకు జగన్‌పై కేసు నమోదు చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. 
 
నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ మోహన్ రెడ్డి ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తూ చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపాలనీ, ఉరి తీయాలనీ పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. సాక్షాత్ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిపై జగన్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. 
 
ఈ వ్యవహారంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా జగన్‌పై కేసు నమోదు చేయాలంటూ అధికారులను ఆదేశించింది. ముఖ్యమంత్రిని నడిరోడ్డుపై కాల్చినా తప్పులేదన్న జగన్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య దేశంలో అభ్యంతరకరమని తెలిపింది. జగన్ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తాయని తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.