శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 4 జూన్ 2024 (16:30 IST)

చంద్రబాబు నివాసంలో విజయోత్సవాలు.. కేక్ కట్ చేసి... (Video)

babu family celebrations
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు అధికార వైకాపాకు చుక్కలు చూపించారు. అధికార గర్వంతో రెచ్చిపోయిన వైకాపా నేతలను నేలపై కూర్చోబెట్టి, ప్రతిపక్ష కూటమికి పట్టం కట్టారు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ అత్యధిక స్థానాలు గెలుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ పార్టీ ఏకంగా 144 స్థానాల్లో పోటీ చేసి 134 చోట్ల గెలుపొందింది. దీంతో ఉండవల్లిలోని పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు, నారా లోకేశ్, భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాన్ష్, ఇతర కుటుంబ సభ్యులు కేరింతలు కొడుతూ ఫలితాలను ఆస్వాదించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు  తెలుపుకున్నారు. ముఖ్యంగా నారా లోకేశ్ తల్లి భువనేశ్వరిని హత్తుకుని ఆనందం వెలిబుచ్చారు. చిన్నారి దేవాన్ష్ కేక్ కోసి అందరికీ తినిపించాడు. ఈ వేడుకల్లో నందమూరి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.