Dharma Sangrah
✕

పేకాట ఆడిన ఎర్రబెల్లి దయాకర్ రావు.. ఇలాంటి వారితో బంగారు తెలంగాణ?

Written By సెల్వి
Updated: గురువారం, 17 మార్చి 2022 (10:21 IST)
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేకాట ఆడుతూ వివాదాల్లో చిక్కుకున్నారు. సభ్య సమాజం సిగ్గుపడే రీతిలో జూదం ఆడుతూ పేకాట రాయుడిగా పట్టుబడ్డ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని కేబినెట్​ నుంచి బర్తరఫ్​ చేయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​ డిమాండ్​ చేశారు.
 
ఈ సందర్భంగా ఎర్రబెల్లి పేకాట ఆడుతూ ఉన్నాడంటూ ఫొటోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ నిషేధిత మత్తు పదార్థాలు బహిరంగ ప్రదేశాల్లో తింటూ మీడియా కంటికి చిక్కారని గుర్తు చేశారు. 
 
రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తులను బ్యాన్​ చేశారని, ఎక్కడైనా పోలీసులు దాడులు చేసి పట్టుకుంటున్నారని, కానీ మంత్రులకు ఎలా దొరికిందని, ఎవరు స్మగ్లింగ్​ చేస్తున్నారని ప్రశ్నించారు.  
 
తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేకాడుతూ పట్టుబడ్డ చిత్రాలు సామజిక మాధ్యమాల ద్వారా వైరల్ అవుతున్నాయని, అలాంటి సన్నాసి మంత్రుల ద్వారా బంగారు తెలంగాణ ఎలా సాధిస్తారో సీఎం కేసీఆర్ చెప్పాలని శ్రవణ్​ ప్రశ్నించారు. 
 
సాధారణ పౌరులు వినోదం కోసం పేకాట ఆడితే కేసులు పెట్టి నానా హింసలు పెట్టే పోలీసులు ఎందుకు ఎర్రబెల్లి, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. గుట్కారాయుళ్ళు, గ్యాంబ్లర్స్‌తో బంగారు తెలంగాణ సాధ్యం కాదని, ఇలాంటి సన్నాసులకు మంత్రులుగా కొనసాగే అర్హత లేదని, వెంటనే వీరిని మంత్రి పదవుల నుంచి బర్త్‌రఫ్ చేసి క్రిమినల్ కేసులు పెట్టాలని శ్రవణ్​డిమాండ్​ చేశారు.

అన్నీ చూడండి

సామాజిక మార్పు కోసం పోరాడిన పూలే చిత్రం విడుదలకు సిద్ధమైంది

రాయవలస నుంచి విడుదలైన నీతో ఓ అడుగు అంటూ ప్రేమ గీతానికి మంచి స్పందన

అప్పాకుట్టి సినిమా ప్రమోషన్-రైలులో ప్రయాణించిన విజయ్ ఆంటోనీ (video)

Chandrabose: గ్రామోఫోన్ రికార్డుల నుండి ఆస్కార్ అవార్డుల వరకు—సాంకేతిక పరిణామాన్ని నేను కళ్లారా చూశాను: చంద్రబోస్

Vijay Sethupathi :మొబైల్ యాప్ లోన్ నేపథ్యంగా విజయ్ సేతుపతి ఆవిష్కరించిన ఈగో రాజా టీజర్

తర్వాతి కథనం
Show comments