శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: శుక్రవారం, 10 జులై 2020 (18:39 IST)

ఈఎస్ఐ కుంభకోణం: మాజీ మంత్రి పీఎస్ అరెస్ట్

ఏపీలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణంలో ఏసీబీ మరింత దూకుడు పెంచింది. ఇప్పటికే అచ్చెంనాయుడుతో సహా పది మంది అరెస్టు అయిన విషయం తెలిసిందే. తాజాగా ఏసీబీ అధికారులు మరొకర్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
 
టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పితానీ సత్యనారాయణ వద్ద పీఎస్‌గా పనిచేసిన మురళీ మోహన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఆధ్రప్రదేశ్ సచివాలయం వద్ద ఏసీబీ అధికారులు అరెస్టు చేసారు.
 
మురళీ మోహన్ ప్రస్తుతం సచివాలయంలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ఈఎస్ఐ కుంభకోణం అరెస్టుల సంఖ్య 11కు చేరింది.