బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 జులై 2020 (07:03 IST)

కామాంధుడు కాడు... అంతకంటే ఎక్కువ ... ఆవుపై అత్యాచారం... ఎక్కడ?

కొందరు పురుషుల వల్ల సమాజంలోని మహిళలు, అమ్మాయిలకే కాదు... చివరకు మూగ జీవులకు కూడా రక్షణ లేకుండా పోతోంది. తాజా ఓ కామాంధుడు చేసిన పనికి ఇపుడు దేశం యావత్తూ విస్తుపోయింది. అతను చేసిన పనికి తక్షణం ఉరితీయాలనే డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. ఇంతకీ అతను చేసిన పాడుపని ఏంటంటే... ఆవుపై అత్యాచారం చేయడం. ఈ దారుణం బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నెల 4వ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో పాకలో కట్టేసిన ఆవు విచిత్రంగా అరుస్తుండటంతో యజమాని అక్కడకు వచ్చాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి అక్కడి నుంచి పారిపోవడంతో... సీసీటీవీలో చెక్ చేశాడు. 
 
అందులో రికార్డైన జుగుప్సాకరమైన దృశ్యాన్ని చూసి అతను షాక్‌కు గురయ్యాడు. వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు.
 
నిందితుడి పేరు షబ్బీర్ అలీ (55) అని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నారు. నిందితుడికి ఉరిశిక్షను వేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి