బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 20 ఫిబ్రవరి 2024 (10:33 IST)

సంస్కారాన్ని మరిచి బూతులు తిట్టే నేతలకు ఓటుతో బుద్ధి చెప్పండి : వెంకయ్య పిలుపు

venkaiah naidu
సంస్కారాన్ని మరిచి బూతులు తిట్టే రాజకీయ నేతలకు ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. పార్లమెంట్, అసెంబ్లీ వేదికల సాక్షిగా కొందరు రాజకీయ నేతలు అపహాస్యపు పనులు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా, పలువురు నేతలు తమ స్థాయిని మరిచి మరింతగా దిగజారిపోయ చౌకబారు మాటలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. అదేసమయంలో మాతృభాషను ఎవరూ మరిచిపోరాదని సూచించారు. ఇదే విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో రాజకీయ నేతలు సంస్కారాన్ని మరిచిబూతులు మాట్లాడుతున్నాని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి పోలింగ్ బూత్‌లలోనే సమాధానం చెప్పాలని కోరారు. చదువు ఎంత ముఖ్యమో.. సంస్కారం కూడా అంతే ముఖ్యమన్నారు. 
 
ఇకపోతే, మాతృభాష కళ్లు లాంటిదన్నారు. తల్లిలాంటి భాషను ఎవరూ మర్చిపోరాదని కోరారు. విలువలతో కూడిన విద్య ఉంటేనే విలువలతో కూడిన పౌరుడిగా తయారవుతారని చెప్పారు. ఇపుడు విలువలతో కూడిన విద్య తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశఁలో ఉన్న మేధోశక్తి వల్ల ప్రపంచమంతా మనవైపు చూస్తుందన్నారు. భగవంతుడు ఏం కావాలని అడిగితే మళ్లీ విద్యార్థి దశకు తీసుకెళ్లాలని కోరుకుంటానని చెప్పారు. గూగుల్ అనేది గురువుని మించింది కాదన్నారు. దేశ వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. 
 
అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె ప్రియుడితో వెళ్లిపోయిందనీ... 
 
తాము అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె ప్రియుడితో వెళ్లిపోవడాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పోయారు. దీంతో నిద్రమాత్రలు మింగి తనువు చాలించారు. ఈ విషాదకర ఘటన కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కాలేజీకి వెళ్లే తమ కుమార్తె ప్రేమించిన యువకుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమెకు ఎంత నచ్చజెప్పినా వినిపించుకోలేదు. దీంతో ఆ యువతి తల్లిదండ్రులు ఉన్నికృష్ణ, బిందు దంపతులు తీవ్రమైన మానసికక్షోభకు గురయ్యారు. 
 
ఈ క్రమంలో శనివారం రాత్రి మోతాదుకు మించి నిద్రమాత్రలు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. బిందు శనివారం రాత్రి మృతి చెందగా, ఉన్నికృష్ణ ఆదివారం ఉదయం ప్రాణాలు విడిచాడు. కుమార్తె ప్రేమ వ్యవహారం పట్ల ఆ దంపతులు మానసికంగా కుంగిపోయారనీ, ఎంత నచ్చజెప్పినా వినకుండా కుమార్తె తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయిందని బంధువులు చెప్పారని పోలీసులు వెల్లడించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.