శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 25 జనవరి 2024 (23:49 IST)

వెంకయ్య నాయుడు, చిరంజీవి గార్లకు పద్మవిభూషణ్ పురస్కారాలు

Chiru-Venkaiah Naidu
కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు 2024ను ప్రకటించింది. ఆయా రంగాల్లో విశేషమైన సేవలు అందించేవారికి ఈ అవార్డులతో కేంద్రం సత్కరిస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది మొత్తం 132 మందికి పురస్కారాలు దక్కాయి. అందులో ఐదుగురికి పద్మ విభూషణ్ పురస్కారాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి వెంకయ్య నాయుడు(ప్రజా వ్యవహారాలు), మెగాస్టార్ చిరంజీవి(కళారంగం) గార్లకు పద్మవిభూషణ్ పురస్కారాలు దక్కాయి. అలాగే తమిళనాడు నుంచి వైజయంతి మాల బాలి(కళారంగం), పద్మ సుబ్రహ్మణ్యం(కళారంగం) గార్లకు పద్మవిభూషణ్ దక్కగా, బీహార్ నుంచి బిందేశ్వర్ పాఠక్(సామాజిక సేవ)కు పద్మవిభూషణ్ దక్కింది. 
 
అలాగే 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీలు దక్కాయి. పద్మ అవార్డుకు ఎంపికైన తెలుగువారిలో యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, హరికథ కళాకారిణి ఉమామహేశ్వరి, బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్పలు వున్నారు. అత్యున్నత పురస్కారం భారతరత్నను బీహార్ జననాయక్, మాజీ సీఎం కర్పూరి ఠాకూర్(మరణానంతరం) ఇటీవల ప్రకటించారు.