బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 1 ఆగస్టు 2020 (16:53 IST)

30 మంది యువతులు, మహిళలతో కామవాంఛ తీర్చుకున్న దొంగబాబా, ఎక్కడ?

అసలే కరోనా కాలం. ఆరోగ్యంగా ఉండాలని, ఉద్యోగాలు రావాలలని, కుటుంబ సమస్యలు తొలగిపోవాలని ఇలా జనం భావిస్తున్నారు. దీంతో కొంతమంది బాబాలను ఆశ్రయిస్తున్నారు. అయితే దీన్నే ఆసరాగా చేసుకున్న కొంతమంది దొంగబాబాలు ఏకంగా మహిళలు, యువతలతో కామవాంఛ తీర్చేసుకుంటున్నారు. అలాంటి ఘటనే చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది.
 
శ్రీకాళహస్తి పట్టణం పూసలవీధికి చెందిన ఒక వ్యక్తి బాబా అవతారమెత్తాడు. తన మంత్రశక్తులతో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తానని, కరోనా రాకుండా చేస్తానని.. ఎలాంటి సమస్యలు ఉన్నా తీర్చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అలా అలా అందరికీ తెలిసింది. అసలు విషయం తెలియని కొంతమంది దొంగబాబాను ఆశ్రయించారు.
 
అమ్మాయిలు, మహిళల అవసరాన్ని ఆసరాగా చేసుకుని వారికి మత్తు మందు కలిపి ఇచ్చి నగ్నంగా ఫోటోలు తీసి వాటిని చూపించి లోబరుచుకునేవాడు. ఇలా 30 మంది మహిళలు, యువతుల జీవితాలతో చెలగాటమాడుకున్నాడు. నిన్న ఇదేవిధంగా ఒక కుటుంబం వెళ్ళింది. ఇద్దరు యువతులను మభ్యపెట్టాడు. 
 
దీంతో ఆ యువతులు కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు పోలీసులకు ఆశ్రయించారు. విషయం బయటకు రానివ్వకుండా ఆ దొంగబాబా ఓ రాజకీయ పార్టీ నేతను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.