మంగళవారం, 12 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 1 ఆగస్టు 2020 (16:13 IST)

ఎపికి పులకేసి రాజు జగన్ అంటూ నారా లోకేష్ ఫైర్

ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్సి నారా లోకేష్. ట్విట్టర్ ద్వారా సిఎంపై ఫైరయ్యారు. మూర్ఖత్వానికి మానవ రూపం వై.ఎస్.జగన్ అంటూ ధ్వజమెత్తారు. 79 మంది రైతుల్ని పొట్టనపెట్టుకున్నా ఆయన అహం చల్లారలేదు.
 
14 నెలల్లో ఏ ప్రాంతంలోను ఒక్క ఇటుక పెట్టని జగన్ రెడ్డి మూడు రాజధానులు నిర్మిస్తా అంటూ హింసించే రాజు పులకేసిని తలపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా మీలో మార్పు రాదా. ఎంతమంది రైతులు చనిపోవాలి. 
 
రాజధానిగా అమరావతినే కొనసాగించాలి. అది అవసరం. అన్ని విధాలుగా అభివృద్ధి అమరావతిలో జరిగింది. ఇప్పటికైనా మారండి అంటూ జగన్‌కు వార్నింగ్ ఇచ్చినట్లు ట్వీట్ చేశారు. నిన్న గవర్నర్ సిఆర్డీఓ రద్దుతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో రాజధాని మార్పుపై నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుబడుతున్నారు నారా లోకేష్. మరోవైపు టిడిపి నాయకులు, అమరావతి జెఎసి నేతలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిస్తున్నారు.