శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 13 జూన్ 2017 (13:29 IST)

ఐటీ ఉద్యోగాల కోసం రూ.లక్ష.. 70మంది మోసపోయారు.. అవెన్యూ బండారం బయటపడింది..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బతో ఐటీ ఉద్యోగాలంటేనే వద్దు బాబోయ్ అంటూ జడుసుకుంటున్న తరుణంలో.. లక్షల్లో డబ్బులు కట్టి మరీ ఐటీ జాబ్స్ కొనుక్కుంటున్నారు. డొల్ల కంపెనీలు పుట్టుకురావడంతో.. యువత డబ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బతో ఐటీ ఉద్యోగాలంటేనే వద్దు బాబోయ్ అంటూ జడుసుకుంటున్న తరుణంలో.. లక్షల్లో డబ్బులు కట్టి మరీ ఐటీ జాబ్స్ కొనుక్కుంటున్నారు. డొల్ల కంపెనీలు పుట్టుకురావడంతో.. యువత డబ్బు కట్టి మరీ జాబ్స్ సంపాదించుకుంటున్నారు. ఐతే డబ్బు కట్టి మోసపోయిన 70 మంది బాగోతం ప్రస్తుతం బయటపడింది. 
 
ఐటీ సంస్థల్లో ఉద్యోగాల కోత... బోర్డు తిప్పేస్తున్న తరుణాలెన్నో వున్నాయి. తాజాగా హైదరాబాదులోని ఓ సంస్థ చేసిన మోసానికి చాలామంది టెక్కీలు రోడ్డునపడ్డారు. అవెన్యూ ఐటీ కంపెనీ అనే సంస్థ ఐటీ ఉద్యోగాలిప్పిస్తానని 70 మంది వద్ద తలా లక్ష రూపాయలను వసూలు చేసింది. తొలి నెల జీతం కూడా బాగానే వచ్చింది. కానీ రెండో నెల మాత్రం అవెన్యూ సంస్థ బోర్డు తిప్పేసింది. 
 
ఇంటర్వ్యూలు, ఆఫర్ లెటర్స్ ఇచ్చినా.. జాబ్‌లో డాయిన్ అయిన రెండో నెల నుంచి ఉద్యోగులకు జీతాలు అందలేదు. గట్టిగా నిలదీస్తే.. యాజమాన్యం చేతులెత్తేసింది. పైగా ఆఫీసుకు తాళాలేసేయడంతో.. ఉద్యోగులకు ఏమి అంతు పట్టలేదు. ఫోన్ చేసి అడిగితే.. ప్రాజెక్టులు లేవని నిర్లక్ష్య సమాధానం.
 
హైదరాబాద్ హైటెక్ సిటీ పరిధిలోని కొండాపూర్‌ ఏక్తా టవర్‌ లో ఈ అవెన్యూ కంపెనీ ఉంది. జగదీశ్ అనే వ్యక్తి కొద్ది నెలల క్రితం దీన్ని నెలకొల్పాడు. నిరుద్యోగ యువతీ యువకులను ఆకర్షించి సుమారు 70మంది చేత తలా రూ.1లక్ష నుంచి లక్షన్నర వరకు కట్టించుకున్నాడు. అంతా నెలరోజులు బాగానే గడిచింది. రెండో నెల నుంచి సంస్థ బోర్డు తిప్పేసింది. జీతాలు లేవని చెప్పేసింది. 
 
ఈ వ్యవహారంపై నల్గొండకు చెందిన మాడ్గుల గణేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ సంస్థ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ విజయవాడకు చెందిన కోతూరి కార్తీక్‌ (26), కంప్యూటర్స్‌ మెయింటెనెన్స్‌ చేసే ఖమ్మం జిల్లాకు చెందిన వల్లభరెడ్డి ఫణీంద్ర కుమార్‌ (28) లను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.