1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 మే 2025 (17:17 IST)

waterfalls: కొడుకును కాపాడిన తండ్రి.. జలపాతంలోనే మునక... ఎక్కడ?

Water
తూర్పు గోదావరిలోని చింతూరులో జలపాతంలో మునిగిపోతున్న తన కొడుకును కాపాడిన తండ్రి జలపాతం నుంచి బయటపడలేక మరణించాడు. వివరాల్లోకి వెళితే, కొత్తగూడెం జిల్లా దమ్మ పేటకు చెందిన భద్రాద్రి కక్కిరాల పురుషోత్తం బుధవారం మోతుగూడెం వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. 
 
అశ్వారావుపేటలో పెట్రోల్ బంక్ సహా అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్న ఆయన 18 సంవత్సరాల క్రితం అశ్వారావుపేట మండలం నారాయణపురంకు చెందిన సంతోషినిని వివాహం చేసుకున్నారు. వారికి 12, 10 సంవత్సరాల వయసున్న కుమారులు దిలీప్, దీపక్ ఉన్నారు. 
 
బుధవారం ఈ జంట పెళ్లి రోజు కావడంతో కుటుంబం అంతా చింతూరు మండలం మోతుగూడెం సమీపంలోని జలపాతానికి విహారయాత్రకు వెళ్లారు. జలపాతం కింద సరదాగా గడుపుతుండగా పెద్ద కుమారుడు నీటిలో మునిగిపోతున్నాడు. 
 
పురుషోత్తం వాగులోకి దిగి తన కొడుకును రక్షించగా, ఆ క్రమంలో అతను నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. పురుషోత్తం నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడాన్ని చూసి భార్య, కుమారులు సహాయం కోసం కేకలు వేశారు. 
 
సమాచారం తెలుసుకున్న స్థానికులు రెండు గంటల పాటు వెతికి లోయలో పడిపోయిన పురుషోత్తం మృతదేహాన్ని వెలికి తీసుకువచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మోతుగూడెం సబ్ ఇన్‌స్పెక్టర్ సత్తిబాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతూరు ఆసుపత్రికి తరలించారు. పురుషోత్తం మృతితో దమ్మ పేట, అశ్వారావుపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.