బుధవారం, 15 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 14 మే 2017 (11:13 IST)

భార్య చనిపోయింది.. మద్యానికి బానిసయ్యాడు.. కన్నకూతుర్ని కాటేశాడు..

మహిళలపై కామాంధులు విరుచుకుపడుతున్నారు. వావి వరసులు లేకుండా, చిన్నాపెద్దా లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో కన్న తండ్రి. సభ్యసమాజం తలదించు

మహిళలపై కామాంధులు విరుచుకుపడుతున్నారు. వావి వరసులు లేకుండా, చిన్నాపెద్దా లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో కన్న తండ్రి. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో  చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే… నందనవనం కాలనీ రోషన్‌దౌలాలో ఓ వ్యక్తి తన కుమారుడు, కుమార్తెను ఆటో నడుపుకుంటూ పోషిస్తున్నాడు. అనారోగ్యం కారణంగా అతడి భార్య మూడేళ్ల కిందట చనిపోయింది. దీంతో మద్యానికి బానిసైన అతడు తాగిన మైకంలో తన కుమార్తెపై కన్నేశాడు. 
 
ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ నెల 11న 13 ఏళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు జరిగిన విషయం తన అన్నయ్యతో చెప్పింది. దాంతో సోదరుడు బంధువుల సహాయంతో తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.