సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (15:25 IST)

కుమార్తె శీలంపై కాటేసిన కన్నతండ్రి

హైదరాబాద్ నగరంలో ఓ కన్నతండ్రి కసాయిగా ప్రవర్తించాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలోని రాజేంద్ర నగర్‌ ప్రాంతానికి చెందిన వెంకటేశ్వర్లు మొదటి భార్య చనిపోవడంతో రెండో వివాహం చేసుకున్నాడు. 
 
అయితే, మొదటి భార్యకు కలిగిన కుమార్తె పెళ్లీడుకొచ్చి తనవద్దే ఉంది. ఆమెను కంటికి రెప్పలా కాపాడి పెళ్లి చేసి అత్తగారిఇంటికి పంపించాల్సిన తండ్రి నీచపు చర్యకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో రెండో భార్య ఇంట్లోలేని సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ విషయాన్ని సవతి తల్లి దృష్టికి తీసుకెళ్లింది. అయినా ఆమె పట్టించుకోలేదు. దీంతో చేసేది ఏమిలేక తన కాలేజీ స్నేహితుల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంకటేశ్వర్లును అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆ అమ్మాయిని చైల్డ్‌ లేబర్‌ ప్రొటక్షన్‌ హాల్‌లో ఉంచారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.