శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 6 ఫిబ్రవరి 2020 (12:07 IST)

తరగతి గదిలోకి పూటుగా మద్యం సేవించి వచ్చిన టీచరమ్మ

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయురాలే దారితప్పింది. పీకల వరకు మద్యం సేవించి బడికి వచ్చింది. ఆ తర్వాత ఏకంగా తరగతి గదిలోకి వచ్చి పాఠాలు చెప్పింది. ఈ ఘటన గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సూరత్‌లోని స్కూల్లో ఓ 38 యేళ్ల మహిళ టీచరుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో జనవరి 31న స్కూలుకు వెళ్లిన ఆమె తప్పతాగి తూలుతూ విద్యార్థుల కంటబడింది.
 
ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో ఘటనపై విచారణకు సూరత్ మున్సిపల్ ఎడ్యుకేషన్ బోర్డు(ఎస్‌ఎంఈబీ) ఆదేశించినట్లు సమాచారం. మంగళవారం జరిగిన ఎస్‌ఎంఈబీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
ఇదిలావుంటే, ఈ ఘటన జరిగిన తర్వాత నుంచి సదరు ఉపాధ్యాయురాలు స్కూల్‌కు వెళ్లడంలేదని తెలుస్తోంది. ఈ విషయంలో తమకు ఎటువంటి సమాచారం అందలేదని స్కూలు వర్గాలు తెలిపాయి.