బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (14:03 IST)

ఫైబర్ నెట్ కేసులో అరెస్టు : మధ్యంతర బెయిల్‌కు కోసం హైకోర్టు

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌)కు సంబంధించిన కేసులో శనివారం అరెస్టు అయిన ఐఆర్‌టీఎస్‌ అధికారి కోగంటి సాంబశివరావు మధ్యంతర బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన ఆదివారం హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 
 
మధ్యంతర బెయిల్ పిటిషన్‌తో పాటు సీఐడీ నమోదు చేసిన కేసు కొట్టి వేయాలని ఆయన కోర్టును కోరారు. ఈ పిటిషన్లను స్వీకరించిన హైకోర్టు.. సోమవారం విచారణ చేపడుతామని వివరించింది. 
 
ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌కు సంబంధించిన తొలి దశ టెండర్లను గత ప్రభుత్వ హయాంలో టెరా సాఫ్ట్‌వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అక్రమంగా కట్టబెట్టారన్న ఆరోపణలపై నమోదైన కేసులో సాంబశివరావును సీఐడీ అధికారులు నిన్న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 
 
ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న ఆయన అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌ మౌలిక వసతుల సంస్థ (ఇన్‌క్యాప్‌) ఎండీగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. కేంద్ర సర్వీసుల్లో ఉండే ఆయనను బదిలీపై రాష్ట్రానికి వచ్చారు.